Hyderabad : హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు

పహాడీషరీఫ్‌లో జరిగిన హత్యకేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీ సోమవారం హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది.

By Kalasani Durgapraveen  Published on  3 Dec 2024 11:04 AM IST
Hyderabad : హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు

పహాడీషరీఫ్‌లో జరిగిన హత్యకేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీ సోమవారం హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం తుక్కుగూడలో నివాసం ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు 31 ఏళ్ల R హేమ్రోమ్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో మృతుడు రమేష్‌తో గొడవ పడి కర్రతో కొట్టి చంపాడు. నిందితుడు హేమ్రోమ్‌కు కోర్టు జరిమానా కూడా విధించింది.

ఈ ఏడాది జులైలో కూడా 2022లో ఒక వ్య‌క్తి తన భార్యను హత్య చేసినందుకు జీవిత ఖైదు విధించబడింది. విచారణలో 19 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకున్న దర్యాప్తు బృందం సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. కోర్టు మల్లేష్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ నేరానికి పాల్పడిన మల్లేష్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Next Story