ఒక వ్యక్తిని పదునైన ఆయుధాలతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో హైదరాబాద్‌లో చిత్రీకరించబడిందని, దాడి చేసిన వ్యక్తి ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.
పోస్ట్ లింక్ ఇక్కడ చూడవచ్చు.
వాట్సాప్ లో కూడా నిందితుడిని ప్రజలే చంపారంటూ వీడియోలను వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
తప్పుడు కథనాలతో సర్క్యులేట్ అవుతున్న పాత వీడియో అని న్యూస్ మీటర్ కనుగొంది. ఈ వీడియో రాజస్థాన్‌లోని టోంక్‌లో చోటు చేసుకున్న ఘటన. అక్కడ ముస్లిం యువకులు కలిసి ఒక హిందూ వ్యక్తిని చంపారు. ఆ వీడియోను సైదాబాద్‌లో అత్యాచార ఘటనకు సంబంధించి లింక్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆ వ్యక్తి కర్ణాటకలోని హవేరిలో హత్య చేయబడ్డాడు. ఈ కేసులో పోలీసులు ఇమ్రాన్ చౌదరిని అరెస్టు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, హత్యకు కారణం దోపిడీ డబ్బుపై వివాదమేనని తెలిపారు. కీవర్డ్ శోధన సహాయంతో, సంఘటన గురించి అనేక వార్తా నివేదికలు మేము కనుగొన్నాము.
సైదాబాద్ అత్యాచార ఘటనకు సంబంధించి నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. పక్కింట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక మృతదేహం లభ్యమవడంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. తూర్పు మండలం డీసీపీ రమేష్ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. గత నాలుగు రోజులుగా పోలీసులు వెతుకున్న సమయంలో సంఘటన అనంతరం నిందితుడు పారిపోయేందుకు అత్యాచారం జరిగిన బస్తీలోనే అతని స్నేహితుడు సహకరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సీసీ కెమెరాలు పరీశీలించిన పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. అత్యాచారం జరిగిన తర్వాత పోలీసులు నిందితున్ని వెతుకున్న సందర్భంలోనే.. నిందితున్ని తప్పించేందుకు అతని స్నేహితుడు సహకరించినట్టుగా తెలుస్తోంది. నిందితుడు రాజు సెల్‌ఫోన్ వాడకపోవడంతో ఎక్కడ ఉన్నాడనే ఆచూకి లభించడం కష్టంగా మారినట్టు పోలీసులు చెబుతున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించి , టెక్నికల్ సపోర్ట్‌తో నిందితున్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇక నిందితుడు పారిపోయోందుకు సహకరించిన స్నేహితుడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఆరేళ్ల బాలికను హత్యాచారం ఘటనలో నిందితుడిని ప్రజలు కొట్టి చంపారంటూ వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.