భారతీయ జనతా పార్టీలో హీరోయిన్ మాధవీ లత కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే ఆమె భారతీయ జనతా పార్టీని వీడుతున్నట్లుగా ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
"బిజెపిలో కామాంధులు ఎక్కువ. పార్టీలో ఉండలేకపొతున్నా," అంటూ ఆమె ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మాధవీ లత 2018లో భారతీయ జనతా పార్టీలో చేరింది.. ఆమె ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది.
భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నట్లుగా ఉన్న ఆ ఫోటోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
టాలీవుడ్ నటి భారతీయ జనతా పార్టీని వీడినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.
2018లో భారతీయ జనతా పార్టీలో చేరిన మాధవీ లత గుంటూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయింది. ఆమెకు భారతీయ జనతా పార్టీలోని కొందరు నాయకులతో విభేదాలు ఉన్నా కూడా.. ఆమె పార్టీని వీడలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె కొనసాగుతూ ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రచారాన్ని చేస్తూనే ఉంది.
ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రచారం చేస్తూనే ఉంది. తాను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసినట్లుగా కూడా ఎటువంటి పోస్టులు మాధవీ లత పెట్టలేదు.
మాధవీ లత ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసంపై కూడా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వీడియోను పోస్టు చేసింది. ఆమె అధికారిక ఖాతాలో లైవ్ వీడియోలో మాట్లాడారు. జనవరి 6 న ఆమె ఈ వీడియోను పోస్టు చేసింది. ఈ లైవ్ వీడియోకు సంబంధించిన ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకొని పోస్టులను వైరల్ చేస్తున్నారు.
టాలీవుడ్ నటి భారతీయ జనతా పార్టీని వీడినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. భారతీయ జనతా పార్టీలో కామాంధులు ఎక్కువ. పార్టీలో ఉండలేకపొతున్నా అంటూ స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేదు.