ముగిసిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి అంత్యక్రియలు

Lt. Col. Uppala Vinay Bhanu Reddy Last rites Completed. అరుణాచల్ ప్రదేశ్ లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మండల కేంద్రానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి

By Medi Samrat  Published on  18 March 2023 2:02 PM GMT
ముగిసిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి అంత్యక్రియలు

అరుణాచల్ ప్రదేశ్ లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మండల కేంద్రానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి అంత్యక్రియలు శనివారం బొమ్మలరామారాం కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో అధికార సైనిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అంత్యక్రియలో జిల్లా మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు వినయ్ బాను రెడ్డి పార్థివదేహానికి పుష్పగుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు. మద్రాస్ రెజిమెంటల్ లెఫ్టినెంట్ కల్నల్ అమిత్ షా ఆధ్వర్యంలో సైనిక గౌరవ వందనం సమర్పించారు. స్వగృహానికి చేరుకున్న పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం సైనిక కవాతును నిర్వహించారు.

వినయ్​భాను రెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబ మల్కాజిగిరి లో ఉంటోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. చాపర్‌ను నడుపుతున్న లెఫ్టినెంట్ కల్నల్ వివిబి రెడ్డి, మేజర్ జయంత్ తుదిశ్వాస విడిచారు. బోమ్‌డిలా పట్టణానికి పశ్చిమాన మండాల సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భాను రెడ్డి భార్య స్పందన పూణేలోని AFMCలో డాక్టర్. తన భర్త మృతదేహాన్ని స్వీకరించేందుకు తేజ్‌పూర్‌కు వెళ్ళి స్వస్థాలానికి తీసుకు వచ్చారు. లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భాను రెడ్డి 17 సంవత్సరాల వయస్సులో NDA లో చేరారు. 2007 లో భారత సైన్యంలో చేరారు.


Next Story