స్కూల్ పిల్లల టెక్ట్స్‌ బుక్స్ లో ఇకపై వాటి గురించి కూడా..!

రోజుకో టెక్నాలజీ పురుడు పోసుకుంటూ ఉండగా పిల్లలకు సరైన చదువు అందించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే టెక్నాలజీతో పిల్లలు పోరాడడం చాలా ముఖ్యం.

By Medi Samrat  Published on  30 May 2024 9:17 AM GMT
స్కూల్ పిల్లల టెక్ట్స్‌ బుక్స్ లో ఇకపై వాటి గురించి కూడా..!

రోజుకో టెక్నాలజీ పురుడు పోసుకుంటూ ఉండగా పిల్లలకు సరైన చదువు అందించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే టెక్నాలజీతో పిల్లలు పోరాడడం చాలా ముఖ్యం. ఇక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలో భాగమైపోతున్నప్పుడు పిల్లలకు కూడా దాని గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. అందులో కేరళ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

పిల్లలకు అందించే విద్యలో కేరళ విద్యాశాఖ గణనీయమైన పురోగతిని సాధించింది. కేరళ తన పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని తీసుకుని వచ్చింది. 7వ తరగతి విద్యార్థుల కోసం ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) పాఠ్యాంశాల్లో AI లెర్నింగ్ మాడ్యూల్స్‌ను ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పాఠ్యాంశాలను 4 లక్షల మందికి పైగా విద్యార్థులు చదవనున్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో AI రంగం గురించి విద్యార్థులకు తెలిసే అవకాశం ఉందని కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (KITE) తెలిపింది.

Next Story