Kerala Governor Visited Sabarimala Temple But Not PM Modi. "ఎటువంటి ప్రకటన లేకుండా ఇరుముడితో ప్రధాని మోదీ శబరిమల దర్శనం" ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా సర్క్యులేట్ అవుతోంది.
నిజంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి ప్రకటన చేయకుండానే శబరిమల దర్శనం చేసుకున్నారా?!
ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియోని గమనించి చూసినప్పుడు పోస్ట్ చేసిన వీడియో కింద కామెంట్స్ లో కొంత మంది దానిని ఫేక్ వీడియోగా అభివర్ణిస్తే మరికొంతమంది ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాదని అంటే మరికొందరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేగా పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో M7news.TV అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కీవర్డ్స్ ని బేస్ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కేరళకు చెందిన యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోను పోస్ట్ చేసినట్టుగా తెలిసింది. 3:49 నిమిషాల నిడివి ఉన్న వీడియోను April 11, 2021 ఆ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శబరిమలను దర్శించినట్లుగా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తో పాటుగా ఆయన చిన్న కుమారుడు కబీర్ మహమ్మద్ ఖాన్ కూడా శబరిమల అయ్యప్ప స్వామికి పూజలు చేశారని జాతీయ మీడియా కూడా ప్రసారం చేసింది. సంప్రదాయాన్ని అనుసరించి స్వామికి ఇరుముడిని కూడా సమర్పించారని ఇందులో ఉంది.
సో, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శబరిమల దేవాలయాన్ని దర్శించలేదు. 2021 ఏప్రిల్ లో కేరళ గవర్నర్ దేవాలయాన్ని సందర్శించిన వీడియోని ప్రధానమంత్రి దర్శించారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు.