FactCheck : గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై కరీనా కపూర్ ఖాన్ విమర్శలు చేసిందా..?

Kareena Kapoor did not criticise the government over hiked gas prices. బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ చేసిన ట్వీట్ అంటూ ఓ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Jan 2023 2:40 PM GMT
FactCheck : గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై కరీనా కపూర్ ఖాన్ విమర్శలు చేసిందా..?

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ చేసిన ట్వీట్ అంటూ ఓ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేశారు. గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.

"హిందువులు నిద్రిస్తున్నప్పుడు గ్యాస్ సిలిండర్ల ధర రూ.380. హిందువులు మేల్కొన్నప్పుడు గ్యాస్ సిలిండర్ల ధర రూ.1,155" అని ట్వీట్ ఆంగ్ల అనువాదం ఉంది.


నిజ నిర్ధారణ :

NewsMeter కరీనా కపూర్ ఖాన్ అధికారిక ట్విట్టర్ ఖాతా కోసం శోధించింది, కానీ నటికి సంబంధించిన ధృవీకరించబడిన ఖాతా ఏదీ కనుగొనబడలేదు.

మేము వైరల్ స్క్రీన్‌షాట్‌లో పేర్కొన్న "@Kareena_kpn1" హ్యాండిల్ కోసం వెతికాము. అది ధృవీకరించని ఖాతా అని కనుగొన్నాము. ఖాతా బయో ప్రకారం, ఇది కరీనా కపూర్ ఖాన్ ఫ్యాన్ పేజీ.


డిసెంబర్ 23న ఆ ఖాతా వైరల్ ట్వీట్‌ని పోస్ట్ చేసిందని మేము కనుగొన్నాము.

మేము ఇన్‌స్టాగ్రామ్‌లో కరీనా కపూర్ ఖాన్ ధృవీకరించబడిన ఖాతా కోసం శోధించాము. గ్యాస్ సిలిండర్‌ల ధరపై అలాంటి వ్యాఖ్య ఏదీ కనుగొనబడలేదు.

గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై కరీనా కపూర్ ఖాన్ ప్రభుత్వాన్ని విమర్శించినట్లు ఏ మీడియా సంస్థ నివేదించలేదు. వైరల్ స్క్రీన్‌షాట్ ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.


Claim Review:గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై కరీనా కపూర్ ఖాన్ విమర్శలు చేసిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story
Share it