FactCheck : సద్గురు జగ్గీ వాసుదేవ్ తో ఉన్నది ఆయన కూతురు రాధే

Jaggi Vasudev’s Image With His Daughter Shared On SocialMedia With False Claims. సద్గురు జగ్గీ వాసుదేవ్ కి సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది

By Nellutla Kavitha  Published on  18 Feb 2023 10:04 AM GMT
FactCheck : సద్గురు జగ్గీ వాసుదేవ్ తో ఉన్నది ఆయన కూతురు రాధే

సద్గురు జగ్గీ వాసుదేవ్ కి సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. అత్యంత సంస్కారి బాబాజీ అంటూ హిందీలో ఈ ఫోటోని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు.

రాందేవ్ బాబా చెబుతున్న సంస్కారవంతమైన ధర్మానికి ఇదొక చిహ్నం అంటూ అదే ఫోటోని మరొక నెటిజన్ కూడా షేర్ చేశారు.

ఒక యువతి జగ్గీ వాసుదేవ్ ఒడిలో కూర్చున్న ఇదే ఫోటోని మిస్ లీడింగ్ కంటెక్స్ట్ తో ట్విట్టర్ లో కూడా మరి కొంతమంది షేర్ చేశారు.

నిజ నిర్ధారణ :

సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ కి సంబంధించిన వైరల్ ఇమేజ్ లో నిజం ఎంత?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఫోటోని గూగుల్ రివర్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. దీంతో ఈ ఫోటో మొదటగా ఫాదర్స్ డే రోజున, June 17, 2018 సద్గురు జగ్గీ వాసుదేవ్ ట్వీట్ చేసినట్టుగా గమనించింది న్యూస్ మీటర్ టీం.

తన తండ్రితో ఫాదర్స్ డే రోజు గడపడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ సద్గురు రెండు ఫోటోలను ట్వీట్ చేశారు. అయితే ఆసక్తికరంగా రెండో ఫోటో గురించి ఒక నెటిజన్ చేసిన కామెంట్ ను ఇక్కడ గమనించవచ్చు. రెండో ఫోటోని భవిష్యత్తులో మిస్ యూస్ చేస్తారు అంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు అదే ఫోటో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది.

ఇక దీంతో మరొకసారి కీ వర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు సద్గురు ఒడిలో ఉన్నది ఆయన కూతురు రాధేగా తెలిసింది. Yogic Insights అనే ఫేస్ బుక్ పేజీలో June 16, 2019 ఫాదర్స్ డే రోజు సద్గురు జగ్గీ వాసుదేవ్, తన కూతురు రాధేతో ఉన్న బాండింగ్ కి సంబంధించి ఒక వీడియోని షేర్ చేశారు. అందులో వైరల్ గా ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న ఫోటో గమనించవచ్చు.

ఈషా ఫౌండేషన్ ఏర్పాటుతోపాటుగా తన కూతురు రాధేను ఎలా పెంచారో వివరిస్తూ సద్గురు జగ్గీ వాసుదేవ్ Sadhguru Wisdom ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో చూడవచ్చు.

ఇటీవల ఉపాసన కామినేని కూడా తన ఫేస్బుక్ పేజీలో ఒక ఫోటోని పోస్ట్ చేశారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ తో పాటుగా, ఆయన కూతురు రాధే, అలాగే ఉపాసన ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ “సద్గురు విత్ హిస్ డాటర్స్” అన్న ఫోటోని ఇక్కడ చూడవచ్చు.

ఇక సద్గురు జగ్గీ వాసుదేవ్ తన ట్రావెల్ డైట్ ని కూతురు రాధేతో షేర్ చేసుకున్న ఇంటర్వ్యూ వీడియోను రాధే తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను ఇక్కడ చూడవచ్చు.

సద్గురు జగ్గీ వాసుదేవ్ తన కూతురు రాధే తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో ఫాల్స్ క్లైమ్ తో షేర్ చేస్తున్నారు.


Claim Review:సద్గురు జగ్గీ వాసుదేవ్ తో ఉన్నది ఆయన కూతురు రాధే
Claimed By:Socialmedia Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story