అక్టోబర్ 27న జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిన పాకిస్థాన్ క్రికెట్ జట్టును ట్రోల్ చేస్తూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ఓ వీడియోలో యాంకర్ న్యూస్ చదువుతూ గట్టిగా నవ్వడం మనం చూడవచ్చు. పాక్ క్రికెట్ ను ఎగతాళి చేసేందుకు ఓ న్యూస్ యాంకర్ నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. జింబాబ్వే పాకిస్థాన్‌ను ఓడించిందన్న వార్త చదివి జింబాబ్వే వార్తా యాంకర్ నవ్వుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
పలువురు ఫేస్ బుక్ యూజర్లు కూడా ఇది నిజమేనని నమ్మి.. వీడియోను షేర్ చేస్తూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించింది మరియు 31 అక్టోబర్ 2020న UTV ఘనా ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయబడిన YouTubeలో అదే వీడియోను కనుగొంది. ఇందులో నిడివి ఎక్కువ ఉన్న వీడియో ఉంది. వీడియో పేరు "Akrobeto 'Massacres' Names Of Foreign Clubs As He Gives Fixtures From Bundesliga To Italian Serie A." అని ఉంది. వైరల్ క్లిప్ 0.50-టైమ్ మార్క్ వద్ద కనిపిస్తుంది.
United Television Ghana Limited (UTV Ghana) ఘనాలో ఒక ప్రైవేట్, ఫ్రీ-టు-ఎయిర్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్. వీడియోలో కనిపిస్తున్న యాంకర్ అక్రోబెటో ఘనా హాస్యనటుడు, టీవీ ప్రెజెంటర్. అతను UTV ఘనాలో "ది రియల్ న్యూస్" అనే షోను హోస్ట్ చేస్తాడు.
జింబాబ్వే విజయంపై న్యూస్ ప్రెజెంటర్ నవ్వారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.