FactCheck : అల్లు అర్జున్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారా? వైరల్ వీడియో వెనుక అసలు నిజాలు తెలుసుకోండి

2024 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు నటుడు అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 April 2024 4:45 AM GMT
FactCheck : అల్లు అర్జున్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారా? వైరల్ వీడియో వెనుక అసలు నిజాలు తెలుసుకోండి

2024 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు నటుడు అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 13న తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో కూడా మే 13న లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

"భారతదేశంలో అతిపెద్ద సూపర్ స్టార్ అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు." అంటూ KRK చేసిన పోస్ట్ ను మీరు చూడొచ్చు.

పలు సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ పోస్టు వైరల్ అవుతూ ఉంది.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

2022లో న్యూయార్క్‌లో జరిగిన వార్షిక ఇండియన్ డే పరేడ్‌లో నటుడు అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్‌గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వీడియో అని మేము గుర్తించాం. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది.

కాంగ్రెస్ పార్టీ కోసం నటుడు ప్రచారం చేస్తున్నారనే మీడియా నివేదికలను కనుగొనడానికి మేము కీవర్డ్ సెర్చ్ చేశాం. అయితే అందుకు సంబంధించి ఎలాంటి కవరేజీని కనుగొనలేకపోయాము.

అల్లు అర్జున్ మామగారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భారత రాష్ట్ర సమితి (BRS)ని వీడి.. కాంగ్రెస్‌లో చేరారని పేర్కొంటూ 2024 ఫిబ్రవరి 16న హిందూస్తాన్ టైమ్స్ ఇటీవలి నివేదికను మేము కనుగొన్నాము. నల్గొండలోని నాగార్జున సాగర్‌లో చంద్రశేఖర్ రెడ్డి చాలా కాలంగా BRS పార్టీకి నాయకత్వం వహిస్తూ వచ్చారు. అయితే చంద్రశేఖర్ రెడ్డిని లేదా కాంగ్రెస్ పార్టీకి అల్లు అర్జున్ మద్దతు తెలిపినట్లు ఏ నివేదికలోనూ లేదు.

వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ సెర్చ్ చేశాం.. మేము టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అధికారిక YouTube ఛానెల్‌లో ఒరిజినల్ వీడియోను కనుగొన్నాం.

‘Icon Star Allu Arjun as Grand Marshal @ 40th India Day Parade in New York | Highlights | #IndiaAt75’ అంటూ ఆగస్టు 23, 2022న వీడియోను అప్లోడ్ చేశారు.


పలు YouTube ఛానెల్‌లు కూడా అప్‌లోడ్ చేసిన అదే వీడియోను కూడా మేము కనుగొన్నాము.

‘న్యూయార్క్‌లో జరిగే వార్షిక ఇండియన్ డే పరేడ్‌లో అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్‌గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు’ అనే వైరల్ వీడియోకు సంబంధించిన ఆగస్టు 2, 2022 నాటి నివేదికను మేము కనుగొన్నాం.

“renowned South Indian actor Allu Arjun served as the Grand Marshal at the annual Indian Day parade in New York, coinciding with India’s 75th year of independence.” అంటూ ఏఎన్ఐ కూడా వీడియోను పోస్టు చేసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన వార్షిక ఇండియన్ డే పరేడ్‌లో ప్రముఖ దక్షిణ భారత నటుడు అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్‌గా ఉన్నారన్నది వీడియోలో తెలిపారు.

ఈ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లకు సంబంధించిన అనేక స్క్రీన్‌షాట్‌లను రిపోర్ట్‌లో చేర్చారు.

ఈ నివేదికను టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రీ హిట్, ది ప్రింట్, హిందుస్థాన్ టైమ్స్.. అనేక ఇతర మీడియా సంస్థలలో కూడా ప్రచురించారు.


స్టాక్ ఇమేజ్ వెబ్‌సైట్ అయిన అలమీలో కూడా ఈవెంట్ కు సంబంధించిన ఫోటో గ్యాలరీని కూడా చూశాము. 'గ్రాండ్ మార్షల్ అల్లు అర్జున్ స్టాక్ ఫోటోలు, చిత్రాలు' కింద ఫోటోలను అప్లోడ్ చేశారు.


2022లో న్యూయార్క్‌లో అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్‌గా పెరేడ్ లో పాల్గొన్న వీడియోకు.. 2024లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తుంది.

Credits : Sunanda Naik

Claim Review:అల్లు అర్జున్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారా? వైరల్ వీడియో వెనుక అసలు నిజాలు తెలుసుకోండి
Claimed By:Social Media User
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story