మెట్రో స్టేషన్‌లో టెర్రరిస్టును ప‌ట్టుకోవ‌డం నిజ‌మేనా..?

Is it real to catch a terrorist in a metro station. ఫరీదాబాద్ మెట్రో స్టేషన్ లో మన జవాన్లు ఒక టెర్రరిస్టును పట్టుకున్నారు అనే వీడియో గత

By Nellutla Kavitha  Published on  29 Jun 2022 1:37 PM GMT
మెట్రో స్టేషన్‌లో టెర్రరిస్టును ప‌ట్టుకోవ‌డం నిజ‌మేనా..?

ఫరీదాబాద్ మెట్రో స్టేషన్ లో మన జవాన్లు ఒక టెర్రరిస్టును పట్టుకున్నారు అనే వీడియో గత నాలుగు రోజులుగా ట్విట్టర్లో వైరల్ అయింది. మెట్రో ప్రయాణం చేసే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ ట్విట్టర్లో ఆ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ

కవైపు జాగ్రత్త చెబుతూనే, మరోవైపు జవాన్లకు అభినందనలు చెబుతూ కొంతమంది ట్విట్టర్ యూజర్లు దానిని షేర్ చేస్తున్నారు. అయితే అందులో నిజమెంత? ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ ఫ్యాక్ట్ చెక్ టీం. కీ ఫ్రేమ్స్, రివర్స్ ఇమేజ్ సెర్చ్, తో పాటుగా కీవర్డ్ సెర్చ్ చేయడంతో ఈ వీడియో కి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు తెలిసాయి.

ఫరీదాబాద్ మెట్రో స్టేషన్ లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక మాక్ డ్రిల్లు చేసిందని, అందులో భాగంగానే ఆ వీడియోను కొంతమంది రికార్డు చేసి వైరల్గా సర్క్యులేట్ చేశారని అర్థమైంది. ఇదే విషయాన్ని ఫరీదాబాద్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ జూన్ 25న తన యూట్యూబ్ ఛానల్ లో వివరించింది. ఫరీదాబాద్ పోలీస్ పి ఆర్ వో విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ ను కూడా అందులో ప్రస్తావించింది ఫరీదాబాద్ న్యూస్ యూట్యూబ్ ఛానల్.


దీంతోపాటుగా ఫరీదాబాద్ పోలీస్ కూడా ఒక క్లారిఫికేషన్ ను ట్విట్టర్ లో విడుదల చేసింది. దాన్ని మాక్ డ్రిల్ గానే చూడాలంటూ జూన్ 26న ట్వీట్ చేశారు ఫరీదాబాద్ పోలీసులు. ఇక PIB కూడా దీన్ని ఫాల్స్ వీడియో గా జూన్ 27న ట్వీట్ చేసింది. అయితే ఫరీదాబాద్లో మెట్రో స్టేషన్ లో ఈ మాక్ డ్రిల్ ఎక్కడ జరిగింది అనేది మాత్రం ఎవరూ నిర్ధారించలేదు. ఈ నేపథ్యంలోనే ఫాక్ట్ చెక్ టీం గూగుల్ మ్యాప్స్ ఫాలో అయింది. వీడియో లో కనిపిస్తున్న పెద్ద భవనాన్ని మీద ఉన్న SSR, CMR అక్షరాల ఆధారంగా ఒక భవనంను గుర్తించి గూగుల్ మ్యాప్స్ లో దాన్ని ట్రేస్ చేయగలిగింది న్యూస్ మీటర్ ఫాక్ట్ చెక్ టీం.

దీంతో అది ఏక్తా నగర్ ఫరీదాబాద్ లో ఉన్న ఎన్ హెచ్ పి సి మెట్రో స్టేషన్ గా గుర్తించగలిగిన న్యూస్ మీటర్ టీం. అయితే వైరల్ గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినట్టుగా ఫరీదాబాద్ మెట్రో స్టేషన్లు సీఐఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నది టెర్రరిస్టును మాత్రం కాదు, అది కేవలం మాక్ డ్రిల్ మాత్రమే అంటే ఇది కేవలం ఫాల్స్ క్లెయిమ్.

Next Story
Share it