FactCheck : ఆ స్పానిష్ నటి రాహుల్ గాంధీ భార్య అంటూ ప్రచారం

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అవివాహితుడు అని అబద్ధం చెబుతున్నారని.. ఒక మహిళతో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పోజులిచ్చినట్లు చూపుతున్న చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Aug 2024 8:30 PM IST
FactCheck : ఆ స్పానిష్ నటి రాహుల్ గాంధీ భార్య అంటూ ప్రచారం

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అవివాహితుడు అని అబద్ధం చెబుతున్నారని.. ఒక మహిళతో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పోజులిచ్చినట్లు చూపుతున్న చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


ఫేస్‌బుక్ పోస్ట్‌లో.. రాహుల్ గాంధీ, తన రహస్య కొలంబియన్ భార్యతో ఉంటున్నారని ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా లండన్‌లో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారని అందులో తెలిపారు. ఈ సమాచారం వికీలీక్స్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఈ చిత్రంలో రాహుల్ గాంధీతో ఉన్నది స్పెయిన్ నటి నథాలియా రామోస్‌.

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా.. సెప్టెంబర్ 21, 2017న ‘Rahul Gandhi’s Pic With Spanish Actress Creates Flutter on Social Media.’ అనే శీర్షికతో న్యూస్ 18 ప్రచురించిన నివేదికను మేము చూశాము.

నివేదిక ప్రకారం, గాంధీ 2017లో USలో తన రెండు వారాల పర్యటన సందర్భంగా స్పానిష్-ఆస్ట్రేలియన్ నటి నథాలియా రామోస్‌ను ఒక సమావేశంలో కలిశారు.

సెప్టెంబరు 15, 2017న రామోస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా అదే చిత్రాన్ని పోస్ట్ చేశారు.

ఏదైనా వికీలీక్స్ దర్యాప్తులో రాహుల్ గాంధీ రహస్య భార్య, పిల్లల గురించి వెల్లడించారా అని కూడా మేము వెతికాము. కానీ సంస్థ వెబ్‌సైట్‌లో అలాంటి నివేదిక ఏదీ కనుగొనలేదు. అలాగే, ఈ వాదనను ఏ మీడియా నివేదికలు ధృవీకరించలేదు.

మేము 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో వాయనాడ్, రాయ్‌బరేలీ నియోజకవర్గాలలో రాహుల్ గాంధీ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ను కూడా తనిఖీ చేసాము. తన జీవిత భాగస్వామి పేరు లేదని స్పష్టంగా తెలుస్తోంది.


రాహుల్ గాంధీ తన 'రహస్య భార్య'తో కలిసి చిత్రంలో లేరని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Next Story