ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రముఖ పాప్ సూపర్ స్టార్ రిహన్నా పక్కన కూర్చుని ఆమె వైపు చూస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పలువురు ట్విటర్, ఫేస్‌బుక్ వినియోగదారులు ఈ ఫొటోను షేర్ చేశారు.
2021లో, రిహాన్నా రైతు నిరసనకు మద్దతుగా ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో ఎంతో చర్చకు దారితీసింది. ఆమె ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఓ వర్గం ఆమెను పొగడగా.. మరికొందరు తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత అంతర్గత వ్యవహారాలపై బయటి వ్యక్తుల ప్రమేయం అవసరం లేదని.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. తాజాగా రిహన్నా పక్కన మోదీ కూర్చుని ఉన్న ఫోటో వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
వైరల్ ఇమేజ్ ను డిజిటల్‌గా ఎడిట్ చేశారని న్యూస్‌మీటర్ కనుగొంది. అసలు చిత్రంలో ప్రధాని మోదీ ఖాళీ కుర్చీని చూస్తున్నారు. మేము మోదీ ఫోటోను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఆగష్టు 29, 2022న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన అసలైన చిత్రానికి దారితీసింది. అందులో మోదీ ఖాళీ కుర్చీలను చూస్తున్నట్లు చూపిస్తుంది.
మార్ఫింగ్ చేసిన ఫోటో వైరల్ అయిన తర్వాత, పలువురు ట్విట్టర్ వినియోగదారులు కూడా అసలు చిత్రాన్ని పోస్ట్ చేశారు.
రిహన్న ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించినప్పుడు అది 2017 సంవత్సరానికి చెందిన ఫోటో అని గుర్తించాం. రిహన్న హార్వర్డ్ లో 2017 సంవత్సరానికి గానూ.. హ్యుమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తీసుకుంటున్నప్పుడు ఈ ఫోటో అని మార్చి 1, 2017 నుండి మిర్రర్ ద్వారా ఒక నివేదికను మేము చూశాము.“Rihanna is chic in off-the-shoulder dress as she collects Harvard’s 2017 Humanitarian of the Year Award.” అంటూ ఫోటోను పబ్లిష్ చేశారు.
ఈ నివేదికలో ఆ ఈవెంట్ కు సంబంధించిన అనేక ఫోటోలను గుర్తించాం. ఎక్కడా ఆమె ప్రధాని మోదీ పక్కన కూర్చున్నట్లు చూపలేదు
మార్ఫింగ్ చేసిన.. అసలైన ఫోటోలను ఇక్కడ చూడొచ్చు.
ఈ ఫోటోలను మార్ఫింగ్ చేశారని న్యూస్ మీటర్ ధృవీకరిస్తోంది.
Credits : Mahfooz Alam