Credits : Md Mahfooz Alamశ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజం బ్యాటింగ్‌ను ప్రజలు చూస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రం జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్‌లోని లాల్ చౌక్ నుండి వచ్చిందని వినియోగదారులు పేర్కొన్నారు.
"లాల్ చౌక్ కశ్మీర్ కు సంబంధించిన సుందరమైన దృశ్యం అందరూ కింగ్ బాబర్ ఆజం బ్యాటింగ్ చూస్తున్నారు" అనే క్యాప్షన్‌తో ఫేస్‌బుక్ వినియోగదారు ఈ చిత్రాన్ని పంచుకున్నారు.
ఆసియా కప్ టోర్నమెంట్ సందర్భంగా ఈ ఫోటో వైరల్ అవుతూ ఉంది.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ బృందం ఈ చిత్రం మార్ఫింగ్ చేశారని కనుగొంది. అసలు చిత్రంలో లాల్ చౌక్ వద్ద చంద్రయాన్-3 ల్యాండింగ్ కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నట్లు తెలుస్తుంది.
వైరల్ పోస్ట్ లో కామెంట్స్ విభాగంలో ఒక వినియోగదారుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X లో శ్రీనగర్ పోలీసులకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను అప్లోడ్ చేశారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రజలకు సంబంధించినది.
దీని నుండి క్యూ తీసుకొని, మేము Xలో శ్రీనగర్ పోలీసుల పోస్ట్ కోసం వెతికాము. ఆగస్టు 24న షేర్ చేసిన అసలు చిత్రం కనుగొన్నారు. “People at Lal Chowk, Srinagar today witnessed Live coverage of Chandrayaan-3 Landing on the big screen at 'Lal Chowk Square'. @isro #Chandrayaan3,” అంటూ పోస్టు చేశారు.
ఆగస్ట్ 23న, న్యూస్ ఏజెన్సీ ANI కూడా ట్విట్టర్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది, చంద్రయాన్-3 ల్యాండింగ్ ఈవెంట్‌ను ప్రజలకు చూపించడానికి శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ఒక పెద్ద స్క్రీన్‌ను ఉంచినట్లు పేర్కొంది.
శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు పలు మీడియా సంస్థలు నివేదించాయి.
అందువల్ల, బాబర్ ఆజం బ్యాటింగ్‌ను చూసేందుకు శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ప్రజలు గుమిగూడారనే వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam