Fact Check : ఐఐటీ ఢిల్లీలో చెట్లకు అచ్చం కోడిగుడ్లు వచ్చే పద్దతిని కనుక్కుందా..?

IIT Delhi has not developed plant that grows eggs. చెట్లకు అచ్చం కోడిగుడ్డు లాంటి పదార్థం ఉన్న వీడియో సామాజిక మాధ్యమా

By Medi Samrat  Published on  12 Nov 2020 8:52 AM IST
Fact Check : ఐఐటీ ఢిల్లీలో చెట్లకు అచ్చం కోడిగుడ్లు వచ్చే పద్దతిని కనుక్కుందా..?

చెట్లకు అచ్చం కోడిగుడ్డు లాంటి పదార్థం ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఢిల్లీలో వేగన్ ఎగ్(శాకాహార) కోడిగుడ్డును కనిపెట్టినట్లు తెలిపారు. నిజమైన కోడిగుడ్డు ఎలాంటి రుచిని ఇస్తుందో.. ఇది కూడా అచ్చం అలాంటి రుచినే ఇస్తుందని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. నిజమైన కోడిగుడ్లను ఎలాగైతే వండుతారో వీటిని కూడా అచ్చం అలాగే వండాలని పోస్టుల ద్వారా చెబుతూ ఉన్నారు.



అందుకు సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చెట్టుకు అచ్చం కోడిగుడ్డు లాంటిదే ఉంది. దాన్ని కొట్టగా.. కోడిగుడ్డులో ఉన్నటి పచ్చని సొన బయటకు రావడాన్ని గమనించవచ్చు. మొత్తం 26 సెకెండ్ల పాటూ ఆ వీడియో ఉంది. ఆ తర్వాత వెంటనే కన్నడ న్యూస్ వచ్చింది. ఐఐటీ ఢిల్లీ శాఖాహార కోడిగుడ్డును పెసరబ్యాళ్లతో తయారు చేశారని చెబుతూ వస్తున్నారు.





నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టు 'ప్రజలను తప్పుద్రోవ పట్టించడానికి సృష్టించారు'.

శాఖాహార కోడిగుడ్డు లాంటి పదార్థాన్ని ఐఐటీ ఢిల్లీ లో కనిపెట్టారు అంటూ వచ్చిన వార్త ప్రకారం.. అవి చెట్ల రూపంలో ఉండేవి కాదు. 2019లోని రిపోర్టుల ప్రకారం ఐఐటీ ఢిల్లీ లోని సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావ్య దశోరా కోడిగుడ్డుకు ప్రత్యామ్నాయంగా రుచి కలిగించే విధానాన్ని తీసుకుని వచ్చింది. శాఖాహారాన్ని స్వీకరించిన వారికి, కోడి గుడ్డుకు ప్రత్యామ్నాయంగా తీసుకోవాలని ఆమె ప్రయత్నించారు.

వేగన్ ఎగ్ అన్నది పెసరపప్పును ఉపయోగించి అచ్చం కోడి గుడ్డు తరహాలో తయారు చేయవచ్చు. అచ్చం ఎగ్ బుర్జీ ఎలా ఉంటుందో అలాంటి రుచి వచ్చేలా తయారు చేస్తారు. ఐఐటీలోని వాళ్లకు టేస్ట్ కూడా చూపించారు. త్వరలోనే ఐఐటీ ఢిల్లీ నుండి శాఖాహార రీతిలో తయారు చేసిన ఇతర మాంసాహార పదార్థాలు కూడా వస్తాయని తెలిపారు. 'ఎన్విరాన్మెంటల్ హెల్తీ' పదార్థాలను తీసుకుని రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.

Times of India కథనం ప్రకారం సెప్టెంబర్ 19, 2019న ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ రీసర్చ్ కు ఫోర్ పర్సూట్స్ వెంచర్స్ కు చెందిన రాహుల్ దేవన్ వీటికి ఫండింగ్ చేస్తూ ఉన్నారు. పర్యావరణానికి హాని కలిగించకూడదనే ఉద్దేశ్యంతో ప్రత్యామ్నాయాలు తీసుకుని వస్తున్నామని స్పష్టం చేశారు. జంతు హింస తగ్గాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నామని అన్నారు.

ఐఐటీ ఢిల్లీ స్టూడెంట్స్ ఎన్నో ప్రోడక్ట్స్ ను తీసుకుని రావాలని అనుకున్నారు. ఆమ్లెట్ ను తయారు చేయడం కూడా మీరు చూడొచ్చు.


వెజ్ ఆమ్లెట్ తయారీ విధానం 'Recipe: 1 cup mung beans, rinsed 1 cup water 1/4 cup non-dairy milk Mix together in your blender and blend until smooth, then strain. Use a cloth that won't have massive amounts of pulp escaping. HOWEVER, if you find your mixture is too thin, you can add 1 to 2 tbsp of the pulp back into the mixture once strained. Then: Add 1/4 tsp black salt 1/8 tsp Tumeric 1.5 tsp chickpea flour 1/2 tsp garlic powder --add other seasonings as desired, like paprika, chili powder, whatever you like --Once your vegan egg is scrambled or made into an omelet, sprinkle a little black salt on top and you will be amazed at the eggy taste!'


వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది 'ఎగ్ ప్లాంట్స్' అని చెబుతూ ఉన్నారు. తెలుపు రంగు వంకాయలను తీసుకుని వచ్చారు. 1700 సంవత్సరంలో యూరప్ కు చెందిన రైతులు దీన్ని తీసుకుని వచ్చారు.

కానీ వైరల్ అవుతున్న వీడియో మార్ఫింగ్ చేసినవని స్పష్టంగా తెలుస్తోంది. ఐఐటీ ఢిల్లీ తయారు చేసినది చెట్లలో పెరిగే గుడ్లు కాదు.. పెసరపప్పుతో తయారుచేసినది. నిజంగా చెట్లకే పెరిగే కోడి గుడ్డు కానే కాదు. వైరల్ అవుతున్న పోస్టు 'ప్రజలను తప్పు ద్రోవ పట్టించే విధంగా' ఉంది.


Next Story