ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. సింగిల్ బెంచ్ తీర్పు ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది.

By Kalasani Durgapraveen  Published on  22 Nov 2024 12:05 PM IST
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. సింగిల్ బెంచ్ తీర్పు ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. సెప్టెంబర్ 9న స్పీకర్ కు నిర్ణత సమయం విధిస్తూ సింగల్ బెంచ్ తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే... అయితే ఈ మేరకు డివిజన్ బెంజ్ విచారణ జరిపి సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించింది. నిర్ణీత సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చునని.. స్పీకర్ కు ఏలాంటి టైం బాండ్ లేదని హైకోర్టు సూచించింది. రీజనబుల్ టైం లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.

ఈ మేరకు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ను కొట్టేసింది. గతంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలు పై విచారణా షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ బెంచ్ సెప్టెంబర్ 9 న తీర్పు వెల్లడించింది. పిటిషనర్లు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు డివిజన్ బెంచ్ విచారణ జరిపి సింగిల్ బెంచ్ తీర్పు ను కొట్టివేసింది.

Next Story