విదేశాల్లో బయటపడ్డ మహా భారత రథం, ప్రపంచ దేశాల్లో ఎక్కడ తవ్వకాలు ప్రారంభించినా, అక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన పురాతన దేవతా విగ్రహాలు కానీ ఏదో ఒకటి బయట పడుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా సర్క్యులేట్ అయింది.
https://www.facebook.com/100086778655362/videos/1212487419648305/?t=1
నిజనిర్ధారణ:
విదేశాల్లో బయటపడ్డ మహాభారత రథం అంటూ వైరల్ గా సర్క్యులేట్ అయిన వీడియోలో నిజం ఎంత?
న్యూస్ మీటర్ టీం ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది. ఇందుకు గూగుల్ లెన్స్ తో పాటుగా గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చైనాలోని అన్ యాంగ్ నగరం దగ్గర్లో ఉన్న Yin Xu మ్యూజియానికి చెందినవిగా తెలిసింది. క్రీస్తుపూర్వం 1350–1046 మధ్యకాలంలో శాంగ్(ఇన్) రాజవంశం పరిపాలించినట్టుగా వికీపీడియాలో సమాచారం లభించింది. ప్రపంచంలోనే అతి పురాతనమైన మ్యూజియంలలో ఇది ఒకటిగా అందులో ఉంది.
https://en.wikipedia.org/wiki/Yinxu https://whc.unesco.org/en/list/1114/
దీంతోపాటు గానే ఇది UNESCO వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన ప్రదేశం కూడా. వైరల్ వీడియోలో కనిపిస్తున్న రథంతో పాటుగా మిగిలిన పరికరాలు, వస్తువులను, ఆభరణాలను కూడా ఇందులో చూడవచ్చు.
https://whc.unesco.org/en/list/1114/
https://whc.unesco.org/en/list/1114/gallery/
మ్యూజియంకు సంబంధించిన మరిన్ని వివరాలు యూట్యూబ్ లో ఉన్న ఈ వీడియోలో ఉన్నాయి. 14 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో తొమ్మిది నిమిషాలు దగ్గర వైరల్ గా సర్క్యులేట్ అయిన వీడియోలు కనిపించిన రథం ఉంది.
https://youtu.be/CnqLeQYSxKo
చైనాలోని శాంగ్ (ఇన్) రాజవంశం పరిపాలించిన కాలం నాటి రధాన్ని మహాభారత రథంగా సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఇది మహా భారతానికి చెందినది కాదు.