రాష్ట్రంలో ఓమిక్రాన్ వ్యాప్తిని నియంత్రించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించిందని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు.
"సీఎం ఉద్ధవ్ థాకరే జీ ఉత్తర్వులు ఇవి. వ్యాపారులకు ఉదయం 9:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు సమయం ఉంది. దుకాణదారు, కస్టమర్ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి, మాస్క్ లేకుండా పట్టుబడితే పోలీసులు చలాన్ వేస్తారు. సెక్షన్144, రాత్రి కర్ఫ్యూ రాత్రి 9:00 నుండి ఉదయం 5:00 గంటల వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 15, 2021 నుండి 31 జనవరి 2022 వరకు వర్తిస్తుంది" అని వైరల్ పోస్ట్ లో ఉంది.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ స్థానిక వార్తా నివేదికల కోసం వెతకగా.. హిందుస్థాన్ టైమ్స్ శీర్షికతో 'రాష్ట్రం యొక్క కొత్త పెనాల్టీ ఆర్డర్‌పై వ్యాపారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు' అనే శీర్షికతో కథనాన్ని కనుగొన్నారు.
నవంబర్ 29 నివేదిక ప్రకారం.. వినియోగదారులు 'మాస్క్‌లు ధరించకపోతే లేదా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే' మహారాష్ట్రలోని దుకాణదారులకు 10,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. Omicron వేరియంట్ నేపథ్యంలో తీసుకుని వచ్చిన మార్గదర్శకాలను చూసి వ్యాపారుల సంఘాలు షాక్ అయ్యాయి.
మేము 18 డిసెంబర్ 2021న పోస్ట్ చేసిన ANI అధికారిక పేజీలో ఒక ట్వీట్‌ను కూడా కనుగొన్నాము. "రద్దీని నివారించండి, కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించండి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. మూసివేసిన ప్రదేశాలలో 50% వరకు సామర్థ్యం అనుమతించబడతారు; బహిరంగ ప్రదేశాలలో 1000 మంది అంతకంటే ఎక్కువ మంది గుమిగూడేందుకు ముందస్తు అనుమతి అవసరం BMC తెలిపింది" అని ట్వీట్ ఉంది.
డిసెంబరు 16 నుంచి 31 వరకు ముంబైలో 144 సెక్షన్ విధించినట్లు ఇండియా టుడే, హిందుస్థాన్ టైమ్స్ మరో నివేదిక పేర్కొంది. కానీ జనవరి 31, 2022 వరకు మహారాష్ట్రలో 144 సెక్షన్ విధించబడుతుందనే నివేదికను మా బృందం కనుగొనలేదు.
" నగరంలోని దుకాణాలు, ఇతర సంస్థలకు, అన్ని ప్రజా రవాణాలలో పూర్తిగా టీకాలు వేసుకున్న వ్యక్తులకు మాత్రమే యాక్సెస్‌ను పరిమితం చేస్తుంది. ఇతర విషయాల్లో 50℅ వరకు హాజరును కూడా పరిమితం చేయనున్నారు. పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులు మాత్రమే ఈవెంట్‌ను నిర్వహించగలరు మరియు హాజరుకాగలరు" అని నివేదిక పేర్కొంది.
కాబట్టి ఈ వైరల్ పోస్టులు తప్పు దావా తప్పు. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త కోవిడ్-19 మార్గదర్శకాలను జారీ చేసినప్పటికీ, దుకాణాలు ఉదయం 9:00 నుండి రాత్రి 8:00 గంటల మధ్య మాత్రమే నడుస్తాయని.. జనవరి 31, 2022 వరకు సెక్షన్ 144 విధించబడిందనే వాదనలో ఎటువంటి నిజం లేదు.