Fact Check : గ్రెటా థన్ బర్గ్ ముస్లిం కుటుంబంలో జన్మించిందా..?

Greta Thunberg was not born into a Muslim family. OpIndia గ్రెటా థన్ బర్గ్ ముస్లిం కుటుంబంలో జన్మించిందా.

By Medi Samrat  Published on  11 Feb 2021 9:16 AM IST
Greta Thunberg was not born into a Muslim family
OpIndia మీడియా సంస్థకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తున్న కొందరు.. పర్యావరణ కార్యకర్త, స్వీడన్ కు చెందిన గ్రెటా థన్ బర్గ్ ముస్లిం కుటుంబంలో జన్మించిందంటూ చెప్పుకొచ్చారు.


"The real face of Great Thunberg. Her real name is Ghazala Bhat she is daughter of Kashmiri Bussinessmen Hilal Bhat who married to Swedish mother Anna Bjorklund converted to Islam became Aafia. Her parents got killed into car accident. She became orphan later adopted by Svante Thunberg [sic]." అంటూ పోస్టులు పెట్టారు. గ్రెటా థన్ బర్గ్ నిజ స్వరూపం తెలుసుకోవాలని.. ఆమె నిజమైన పేరు గజాలా భట్ అని.. కాశ్మీరీ బిజినెస్ మ్యాన్ హిలాల్ భట్ కు స్వీడిష్ మహిళకు పుట్టిన పాప అని.. ఆ తర్వాత తల్లిదండ్రులు రోడ్డు యాక్సిడెంట్ లో మరణించడంతో ఆమె అనాథగా మారిపోయిందని.. ఆ తర్వాతా స్వాంటే థన్ బర్గ్ ఆమెను పెంచుకోవడం మొదలుపెట్టిందని ఆ వైరల్ పోస్టులో ఉంది. గ్రెటా హిజాబ్ తో ఉన్న ఫోటోను ఈ వైరల్ కథనానికి చేర్చారు.



నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. గ్రెటా థన్ బర్గ్ ను వారే అమ్మాయి ఫోటోతో మార్ఫింగ్ చేశారు. ఒరిజినల్ ఫోటో పలు వెబ్ సైట్లలో కనిపించింది. ఒరిజినల్ ఫోటోను పలు వెబ్ సైట్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పలు వెబ్ సైట్లు కూడా ఈ ఫోటోను పోస్టు చేశారు.

https://786cosmetics.com/blogs/culture/hijab-vs-burka-whats-the-difference



"Secret News" అనే పదాలను వైరల్ అవుతున్న ఫోటోలో చూడొచ్చు. ఇదొక ఫ్రెంచ్ వెబ్సైట్ అని.. అది కూడా పేరడీతో కూడుకున్నదని తెలుస్తోంది.

OpIndia వెబ్సైట్ ను వెతకగా ఇలాంటి కథనం కూడా కనిపించలేదు. వైరల్ ఫోటోకు OpIndia నిజమైన వెబ్సైట్ లో ఉండే కథనాలకు చాలా తేడాలను గమనించవచ్చు. అలాగే కొన్ని వ్యాఖ్యాలలో వ్యాకరణ దోషాలను కూడా గమనించవచ్చు.

గ్రెటా థన్ బర్గ్ ముస్లిం అంటూ వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ ఫేక్ అని స్పష్టంగా తెలుస్తోంది.


Claim Review:గ్రెటా థన్ బర్గ్ ముస్లిం కుటుంబంలో జన్మించిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Opindia
Claim Fact Check:False
Next Story