రాజ్య సభ ఎంపీ, బీహార్ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన సునీల్ కుమార్ మోదీ తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. అందులో భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత మొదటి అయిదుగురు ఒకే సమూహానికి చెందిన వారని ఆయన ట్వీట్ చేశారు.
राहुल गांधी बतायें कि देश के पहले पांच शिक्षा मंत्री केवल एक ही समुदाय से क्यों बनाये गए?
भारत का विकृत इतिहास पढाये जाने और भगवान राम का अस्तित्व नकारने के लिए क्या कांग्रेस माफी मांगेगी? అంటూ ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ మొదటి అయిదుగురు విద్యాశాఖ మంత్రులు ఒకే సమూహానికి చెందినవారు. భారత చరిత్రను మార్చివేయడానికి కారణం ఎవరు..? శ్రీరాముడికి సంబంధించిన విశేషాలను చెప్పకుండా దాచినందుకు కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? అంటూ ఆయన ప్రశ్నించారు.
నిజ నిర్ధారణ:
న్యూస్ మీటర్ ఈ ట్వీట్ ను పరిశీలించగా.. వైరల్ అవుతున్న పోస్టు నిజం కాదు. మొదటి అయిదుగురు విద్యాశాఖ మంత్రులు ఒకే కమ్యూనిటీకి చెందిన వారు అంటూ వైరల్ అవుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.
భారత ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం మొదటి అయిదుగురు విద్యాశాఖ మంత్రులు విభిన్న సమూహాలకు చెందినవారు.
1. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (1947-1958)
2. డాక్టర్ కె.ఎల్.శ్రీమాలి (1958-1962)
3. డాక్టర్ కె.ఎల్.శ్రీమాలి (1962-1963)
4. హుమాయూన్ కబీర్ September 1963-November 1963)
5. ఎం.సి. చాగ్లా (1963-1966)
https://sm.education.gov.in/former-ministers
ఇంటర్నెట్ లో వీరికి సంబంధించిన ఎంతో సమాచారం ఉంది.
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఓ గొప్ప విద్యావంతుడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' ఆయన కలంపేరు. భారత స్వాతంత్య్ర సమరంలో కూడా ఆయన పాలు పంచుకున్నారు. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. అలీఘర్ లోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీని స్థాపించిన ఫౌండేషన్ కమిటీలో ఆయన కూడా ముఖ్య వ్యక్తి.
కె.ఎల్.శ్రీమాలి.. ఒక హిందువు. జన్ శిక్షణ్ కు ఎడిటర్ గా కూడా పని చేశారు. ఆయన భారత విద్యా వ్యవస్థకు చేసిన కృషికి పద్మ విభూషణ్ తో 1976లో భారత ప్రభుత్వం సత్కరించింది.
హుమాయూన్ కబీర్.. ఖాన్ బహదూర్ అహ్మద్ కుమారుడు. ఆయన బెంగాల్ లోని డిప్యూటీ మేజిస్ట్రేట్ గా సేవలను అందించారు. ఒక కవిగానే కాకుండా ఎన్నో రచనలను, వ్యాసాలను బెంగాలీ భాషలో రాశారు.
ఎం.సి. చాగ్లా గుజరాతీ ఇస్మాయిలి ఖోజా కుటుంబంలో పుట్టారు. ఈయన జిన్నాను ఎక్కువగా ఆరాధించేవారని చరిత్ర చెబుతోంది.
REFERENCE:
https://en.wikipedia.org/wiki/Abul_Kalam_Azad
https://www.udaipurblog.com/kalu-lal-shrimali-people-from-udaipur-you-should-know-about.html
https://en.wikipedia.org/wiki/Humayun_Kabir
https://www.britannica.com/biography/M-C-Chagla )
మొదటి అయిదుగురు విద్యాశాఖ మంత్రులు ఒకే కమ్యూనిటీకి చెందిన వారు అంటూ సునీల్ కుమార్ మోదీ చేసిన ట్వీట్ లో ఎటువంటి నిజం లేదు.