నిజమెంత: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ప్రజలు దాడి చేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు.

ముస్లింల విషయంలో బుజ్జగింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై ఢిల్లీ వాసులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై దాడికి పాల్పడినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Nov 2024 3:42 AM GMT
AAP, Delhi, Communal, Gulab singh Yadav

నిజమెంత: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ప్రజలు దాడి చేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు. 

ముస్లింల విషయంలో బుజ్జగింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై ఢిల్లీ వాసులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై దాడికి పాల్పడినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక నిమిషం నిడివిగల వీడియోలో ఒక వ్యక్తి మరికొంత మందితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు చూపిస్తుంది. వాగ్వాదం చివరికి శారీరక హింసకు కూడా దారితీసింది. వీధిలోకి తరిమికొట్టారు. కొంతమంది వ్యక్తులు AAP టోపీలు ధరించి ఉండగా, మరికొందరు టోపీలు లేకుండా కనిపించారు. వీడియోలో కొందరు వ్యక్తులు అతనిని సమర్థించడం చూడవచ్చు.

ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేసి.. "ముస్లింలకు మద్దతుగా ఉంటూ ఆప్ పార్టీ హిందువులను విస్మరిస్తోందని ఢిల్లీ ప్రజలు AAP నాయకులను కొట్టడం ప్రారంభించారు" అని రాశారు. (ఆర్కైవ్)


పలు సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ఇక్కడ మరియు ఇక్కడ క్లిక్ చేయండి. ఆర్కైవ్

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. మటియాలా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై ఆప్ కార్యకర్తలు దాడి చేసినట్లు వీడియోలో ఉంది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్చేయగా మేము ది ట్రిబ్యూన్ నివేదికను కనుగొన్నాం. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఢిల్లీలోని పార్టీ కార్యకర్తల చేతిలో దెబ్బలు తిన్నారు అనే వాదనతో ఓ కథనాన్ని కనుగొన్నాము. తనను తాను రక్షించుకోవడానికి ఆయన పరిగెత్తుతున్నట్లుగా వీడియో వైరల్ అవుతోందంటూ నవంబర్ 22, 2022న కథనాన్ని ప్రచురించినట్లు మేము చూశాం.


రిపోర్ట్‌లో వేరొక కోణం నుండి తీసుకున్న సంఘటనకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఉంది. దాడి చేసిన వ్యక్తులను, మరొక వ్యక్తిని చూపిస్తూ, వైరల్ వీడియోలో కూడా ఉంది. ఇక్కడ రెండింటి మధ్య పోలిక ఉంది.


నివేదిక ప్రకారం, మటియాలా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై బీజేపీ క్లెయిమ్ చేసినట్లుగా మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికల టిక్కెట్లను విక్రయించారనే ఆరోపణలపై పార్టీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు.

నవంబర్ 22, 2022న.. AAP ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ను ఢిల్లీలో కొట్టారు.. తనను తాను రక్షించుకోవడానికి పరిగెత్తాడనే శీర్షికతో కూడిన NDTV రిపోర్ట్‌ని కీవర్డ్ సెర్చ్ లో మేము కనుగొన్నాం.


నివేదిక ప్రకారం గులాబ్ సింగ్ యాదవ్, AAP కార్యకర్తల మధ్య రాత్రి 8 గంటలకు జరిగిన సమావేశంలో వాగ్వాదం జరిగింది. టిక్కెట్‌ విక్రయాలపై ఆరోపణలు రావడంతో దాడి చోటు చేసుకుందని బీజేపీ ఆరోపించింది. వీడియోలో ఉన్న ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గుజరాత్ ఎన్నికల సమయంలో ఓటర్ల దృష్టి మరల్చేందుకు బీజేపీ తప్పుడు కథనాలను ప్రచారం చేసిందని ఆరోపిస్తూ, ఈ వివాదం రాజకీయ ప్రేరేపితమని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు.

సంబిత్ పాత్రతో సహా పలువురు బీజేపీ నాయకులు కూడా ఈ సంఘటన గురించి పోస్ట్‌లను పంచుకున్నారు, ఇందులో భిన్నమైన కోణం నుండి వీడియో ఉంది.


సంబిత్ పాత్ర తన పోస్టులో.. నిజాయితీతో కూడిన రాజకీయాలు అంటూ చెప్పుకునే పార్టీలో అపూర్వమైన దృశ్యాలు. AAP అవినీతి దాని స్వంత సభ్యులు కూడా తమ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మారే స్థాయికి చేరుకుందని విమర్శించారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా మరో నివేదిక ప్రకారం గులాబ్ సింగ్ యాదవ్ దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


"నేను ఫిర్యాదు నమోదు చేసాను. నా స్వంత పార్టీ కార్యకర్తలతో సహా కొంతమంది వ్యక్తుల పేర్లను నమోదు చేసాను" అని గులాబ్ సింగ్ చెప్పినట్లుగా నివేదిక ఉంది. కొందరిని బీజేపీ రెచ్చగొట్టిందని ఆయన ఆరోపించారు. వైద్యపరీక్షలు నిర్వహించగా ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, టిక్కెట్‌ పంపిణీపై జరిగిన వివాదంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

ముస్లింలతో బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న ఆప్ నేతలపై ప్రజలు దాడి చేశారన్న వైరల్ వాదనలో ఎలాంటి నిజం లేదు. ఎన్నికల టిక్కెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలపై ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై ఆప్ కార్యకర్తలు దాడి చేసిన వీడియో ఇది.

Credit: Sibahathulla Sakib

Claim Review:ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ప్రజలు దాడి చేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X and Youtube
Claim Fact Check:False
Next Story