ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. అయితే సెమీస్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయారు. కానీ క్రికెట్ ప్రపంచ కప్ లో వారు ఆడిన ఆట అభినందనీయం. పురుషుల ప్రపంచ కప్ ఫైనల్‌లోకి తొలిసారిగా ప్రవేశించారు. భారత జట్టు ఆస్ట్రేలియాను సూపర్-8 లో ఓడించడం కూడా ఆ జట్టు సెమీస్ లోకి అడుగుపెట్టడానికి ఒక కారణం.
అయితే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు 'వందేమాతరం' అంటూ నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండి. సూపర్ ఎయిట్ లో ఆస్ట్రేలియాను 24 పరుగుల తేడాతో భారత జట్టు ఓడించిన తర్వాత ఆఫ్ఘన్ ఆటగాళ్లు 'వందేమాతరం' అంటూ నినాదాలు చేశారని తెలిపారు.
ఇదే వాదనతో X హ్యాండిల్ లో వీడియోను షేర్ చేశారు. “ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది. భారతదేశ విజయంపై ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. కాబట్టి ఈ విజయానికి వారికి కూడా అభినందనలు." అంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు. (ఆర్కైవ్)
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోను ఎడిట్ చేశారని.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter గుర్తించింది. ఒరిజినల్ ఫుటేజీలో ఆఫ్ఘన్ ఆటగాళ్లు 'అల్లా-హు అక్బర్' అంటూ నినాదాలు చేస్తున్నారు.
వీడియో కీఫ్రేమ్స్ కు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా.. అక్టోబర్ 23, 2023న ఆఫ్ఘన్ ప్లేయర్ మొహమ్మద్ నబీ Xలో పోస్ట్ చేసిన అసలైన వీడియోను మేము కనుగొన్నాము.
క్రికెట్ యుద్ధంలో పాకిస్థాన్‌పై సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న విజయోత్సవ వేడుక అని క్యాప్షన్‌లో నబీ తెలిపారు.
అదే తేదీన ఆఫ్ఘనిస్తాన్‌ను అభినందిస్తూ నబీ తన వెరిఫైడ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన అసలైన వీడియోను కూడా మేము కనుగొన్నాము.
అక్టోబర్ 23, 2023 న మీడియా నివేదికల ప్రకారం, ICC పురుషుల ODI ప్రపంచ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ మొదటి ODI విజయానికి సంబంధించినది.
అందువల్ల, వైరల్ వీడియో ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము. ఆస్ట్రేలియాను భారత్ ఓడించిన తర్వాత ఆఫ్ఘన్ ఆటగాళ్లు 'వందేమాతరం' నినాదాలు చేశారన్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credit: Md Mahfooz Alam