FactCheck: మోడీఫై చేసిన ట్రాక్టర్లను నిరసనల కోసం రైతులు తీసుకుని వచ్చారా?
తమ డిమాండ్ల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుండి రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేయాలని భావించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Feb 2024 9:00 AM ISTFactCheck: మోడీఫై చేసిన ట్రాక్టర్లను నిరసనల కోసం రైతులు తీసుకుని వచ్చారా?
తమ డిమాండ్ల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుండి రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేయాలని భావించారు. ఢిల్లీకి ఉత్తరాన 230 కిమీ దూరంలో పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు వద్ద పోలీసులు రైతులను అడ్డుకున్నారు. వారిపై బాష్పవాయువు ప్రయోగించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
ఎంఎస్‌పికి చట్టపరమైన హామీ ఇవ్వాలనే వారి ప్రధాన డిమాండ్‌తో పాటు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, వ్యవసాయ రుణమాఫీని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల నిరసనను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలను బాగా పెంచారు. పలు ప్రాంతాల్లో సమావేశాలపై ఆంక్షలు విధించారు. సరిహద్దులపై నిఘా పెంచారు.
అయితే పోలీసులు పెట్టే బారికేడ్లను తొలగించేలా రైతులు ట్రాక్టర్లను మోడిఫై చేశారని సూచించే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
మోడిఫై చేసిన ట్రాక్టర్‌ల చిత్రాన్ని షేర్ చేస్తూ, ఒక X ప్రీమియం వినియోగదారు.. “#FarmerProtest2024కి ఎవరు నిధులు సమకూరుస్తున్నారో కనుక్కోవాలి.” అంటూ పోస్టు పెట్టారు.
“బారికేడ్లను తొలగించడానికి.. టియర్ గ్యాస్ షెల్స్‌ను అడ్డుకోడానికి ట్రాక్టర్లను పంజాబ్ రైతులు మోడిఫై చేశారని.. వాటితో ఢిల్లీ చలో మార్చ్‌ను మొదలు పెట్టారు, నిఘా సంస్థలు పోలీసులను అప్రమత్తం చేస్తాయి. (sic)” అంటూ మరో పోస్టు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని న్యూస్ మీటర్ ధృవీకరించింది. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ట్రాక్టర్ ఇమేజ్ లను సృష్టించారు.
మేము 'మోడిఫైడ్ ట్రాక్టర్స్' అనే కీవర్డ్‌లను ఉపయోగించి నివేదిక కోసం కీవర్డ్ శోధనను అమలు చేసాము. వార్తా సంస్థ ANI ద్వారా 'రైతుల నిరసన మార్చ్‌కు నాయకత్వం వహించడానికి మోడిఫై చేసిన ట్రాక్టర్లు.. నిఘా సంస్థలు పోలీసులను అలర్ట్ చేశాయి' అనే శీర్షికతో మాకు ఒక నివేదిక కనిపించింది. అయితే, ANI నివేదికలో వైరల్ ఇమేజ్‌కి భిన్నంగా కనిపించే చిత్రాలు ఉన్నాయి.
రైతుల నిరసనలో మోడిఫైడ్ ట్రాక్టర్లు ఉన్నాయని.. కేంద్ర ఏజెన్సీలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. బారికేడ్లను తొలగించేందుకు ట్రాక్టర్లకు హైడ్రాలిక్ టూల్స్, టియర్ గ్యాస్ షెల్స్‌తో పోరాడేందుకు ఫైర్ రెసిస్టెంట్ హార్డ్‌షెల్ ట్రైలర్‌లను అమర్చినట్లు అధికారులను హెచ్చరించారు.
మనీ కంట్రోల్, బిజినెస్ స్టాండర్డ్, ది ఎకనామిక్ టైమ్స్ అనే న్యూస్ అవుట్‌లెట్‌లు ప్రచురించిన నివేదికలలో కూడా రైతులు మోడిఫై చేసిన ట్రాక్టర్‌లను వినియోగిస్తూ ఉన్నారని మేము కనుగొన్నాము. అయితే, వాటిలో ఏవీ వైరల్ ఇమేజ్‌ను పోలినట్లు లేవు. OpIndia ప్రచురించిన ANI సిండికేట్ నివేదికలో మేము వైరల్ చిత్రాన్ని కనుగొన్నాము. క్యాప్షన్‌లో.. ఆ చిత్రం AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి రూపొందించారని నివేదిక పేర్కొంది.
వైరల్ చిత్రం విశ్లేషణ
మేము చిత్రాన్ని సూక్ష్మంగా విశ్లేషించాము. AI ద్వారా రూపొందించిన చిత్రాలలో అనేక వ్యత్యాసాలను కనుగొన్నాము. చిత్రంలోని మొదటి వాహనంలో రెండు ఎగ్జాస్ట్ పైపులు ఉండగా, రెండవదానిలో తేడాను చూడొచ్చు. మూడవ, నాల్గవ వాహనాలకు ఎలాంటి ఎగ్జాస్ట్ పైపులు లేవు. రోడ్డుకు దూరంగా ఉన్న కార్లలో ఒకటి డివైడర్‌పై ఉన్నట్లు అనిపించింది, మరికొన్ని ఎడమ వైపు వాహనాలు వెళ్లే భారతీయ రహదారులకు విరుద్ధంగా కుడి వైపున వెళుతున్నాయి. వాటిలో కొన్ని అస్పష్టంగా కనిపిస్తాయి.
చివరగా, మేము హైవ్ మోడరేటర్ ద్వారా చిత్రాన్ని వెతికి చేసాము.. ఇది AI కంటెంట్ డిటెక్షన్ టూల్. ఈ చిత్రం AI ద్వారా రూపొందించారని.. 99.9 శాతం ఉందని గుర్తించాం.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Credits: Md Mahfooz Alam