నిజమెంత: తాము ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారా?

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలు, యువత ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ పలు హామీలను ప్రకటించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jun 2024 10:00 AM IST
నిజమెంత: తాము ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారా?

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలు, యువత ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ పలు హామీలను ప్రకటించింది. గ్రాడ్యుయేట్‌లు, డిప్లొమా హోల్డర్లందరికీ ఏటా రూ.లక్ష స్టైఫండ్‌తో అప్రెంటిస్‌షిప్‌లు.. పేద కుటుంబాల్లోని మహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తామని హామీలు ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు ఓటర్లపై మంచి ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ఆ పార్టీ 2019లో 52 సీట్ల నుండి 2024 లోక్‌సభ ఎన్నికలలో 99 స్థానాలకు పెరిగింది.ఇక బీజేపీ 240 స్థానాలను గెలుచుకుంది. 2019 ఎన్నికలలో సాధించిన 303 స్థానాల కంటే చాలా తక్కువ.

ఏడు దశల ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత, సోషల్ మీడియా వినియోగదారులు రాహుల్ గాంధీ ఎన్నికల మోసానికి పాల్పడ్డారని, ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు వాగ్దానాలు చేశారని ఆరోపించారు.

ట్విట్టర్ లో ఒక వినియోగదారు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారని కూడా ఆరోపించారు. “యువతకు నెలకు 8,500, సంవత్సరానికి 1,00,000 జీతం ఇస్తామని ఎన్నికల వాగ్దానానికి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారు. అబద్ధాలను చెప్పి 2024 సాధారణ ఎన్నికలలో 99 సీట్లు పొందగలిగారు. ఇది ఎన్నికల్లో మోసం.. ఓటర్లను తప్పుదారి పట్టించే తప్పుడు వాగ్దానాలు చెప్పాడు”అని X వినియోగదారుడు ఆరోపణలు చేశారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ బృందం వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఎన్నికల హామీలపై రాహుల్ గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పలేదు.

ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారంటూ వచ్చిన వైరల్ మెసేజీల గురించి తెలుసుకోడానికి మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేశాం. అయితే రాహుల్ గాంధీ క్షమాపణలకు సంబంధించిన వార్తా నివేదికలు ఏవీ మాకు కనిపించలేదు.

అలాగే, నెలకు రూ.లక్ష ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. కాంగ్రెస్ చేసిన వాస్తవ వాగ్దానాలు యువతకు ఉపాధికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తూ రూ. 1 లక్ష , పేద కుటుంబాల్లోని మహిళలకు సంవత్సరానికి రూ. 1 లక్ష ఉపాధి మార్గాలను అన్వేషించి ఆదాయం వచ్చేలా ఇస్తామని చెప్పారు.

అదనంగా, మేము కాంగ్రెస్ పార్టీ (X, Facebook, Instagram), రాహుల్ గాంధీ (X, Facebook, Instagram)కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్‌లను తనిఖీ చేసాము. కానీ ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలకు సంబంధించి క్షమాపణలు చెప్పినట్లుగా ఏవీ కనుగొనలేకపోయాం.

ఈ వాదనలను కొట్టిపారేసిన కాంగ్రెస్:

న్యూస్‌మీటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ఏఐసీసీ సమన్వయకర్త గౌరవ్ పాంధీని సంప్రదించగా, రాహుల్ గాంధీ ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి క్షమాపణలు చెప్పారనే వాదన పూర్తిగా అబద్ధమని ధృవీకరించారు.

యువ న్యాయ్ పథకం కింద డిప్లొమా, డిగ్రీ హోల్డర్లకు రూ.లక్ష విలువైన అప్రెంటైస్ షిప్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. నారీ న్యాయ్ పథకం కింద, ప్రతి పేద కుటుంబంలోని పెద్ద మహిళకు సంవత్సరానికి రూ. 1 లక్ష, నెలకు సుమారుగా రూ. 8,500 ఇస్తానని హామీ ఇచ్చారన్నారు.

“కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఈ హామీలను తప్పకుండా నెరవేర్చగలిగి ఉండేవాళ్లం. మేము కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ వాగ్దానాలను నెరవేర్చడానికి, యువత, పేదలకు మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రస్తుతం, మేము ప్రతిపక్షంలో ఉన్నందున, ఈసారి బీజేపీ తమ హామీలను నెరవేర్చబోతుందా లేదా అనే దానిపై బీజేపీ మద్దతుదారులు ఆందోళన చెందాలి. బీజేపీ 60కి పైగా సీట్లను కోల్పోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ గురించి అసత్య ప్రచారం చేయకుండా.. బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలి." అని గౌరవ్ పాంధీ వివరించారు.

కాబట్టి, కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారనే వాదనలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.

Credits: Md Mahfooz Alam

Claim Review:తాము ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారా?
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story