నిజమెంత: ముంబై వరదలకు సంబంధించిన పాత వీడియోలను ఇటీవలిదిగా షేర్ చేశారు

ముంబైలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల సమయంలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 July 2024 11:00 AM GMT
NewsMeterFactCheck, Mumbai, floods,rains

నిజమెంత: ముంబై వరదలకు సంబంధించిన పాత వీడియోలను ఇటీవలిదిగా షేర్ చేశారు

హైదరాబాద్: ప్రస్తుతం భారతదేశంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి కూడా!! భారీ వర్షాల కారణంగా ముంబైలో అధికారులు ఇటీవల రెడ్ అలర్ట్ ప్రకటించారు. జూలై 12 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో.. ముంబైలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల సమయంలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో పాత వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

"ముంబయి వర్షాలు భయానకంగా ఉన్నాయి" అనే శీర్షికతో ఒక X వినియోగదారు ఓ వీడియోను షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది. 2020లో ముంబై వరదలకు సంబంధించిన వీడియోను మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మేము కీవర్డ్స్ సెర్చ్ చేయగా.. ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నుండి‘Mumbai sinking: High tide hits Marine Drive, roads flooded, a landslide at Malabar Hill’ (ముంబై మునిగిపోతుంది: హై టైడ్ మెరైన్ డ్రైవ్‌ను తాకింది, రోడ్లు జలమయమయ్యాయి, మలబార్ హిల్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి) అనే శీర్షికతో ఆగస్ట్ 6, 2020 నాటి ఒక నివేదికను కనుగొన్నాం. నివేదికలో వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఉంది. పాక్షికంగా మునిగిపోయిన కారును మనం చూడొచ్చు. ఈ కథనంలోని వీడియోకు.. ఇక్కడ ఉన్న వీడియోకు మధ్య పోలికను గమనించవచ్చు.

నివేదిక ప్రకారం ముంబై నగరం భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌ ఎదురైంది. బైకుల్లా, మస్జిద్ బందర్ స్టేషన్ల మధ్య రెండు రైళ్లలో కనీసం 250 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని, వారిని పడవలపై పోలీసులు, విపత్తు బృందాలు రక్షించాయని నివేదిక పేర్కొంది.

అదనంగా, ‘Mumbai Maharashtra Rain 2020: Flood in Mumbai video street, shops and road water logging everywhere’. అనే శీర్షికతో YouTube ఛానెల్‌లో అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. ఆగస్టు 7, 2020న ప్రచురించారు. అందులో వైరల్ వీడియోకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. యూట్యూబ్ వీడియోలో కూడా గతంలో పేర్కొన్న పాక్షికంగా మునిగిపోయిన కారును చూడొచ్చు. వైరల్ వీడియోలో కూడా నీటిలో మునిగిపోయిన బైక్‌ల వరుసలను చూపించింది.

ఇక్కడ ఇందుకు సంబంధించిన ఒక పోలిక చిత్రం ఉంది.

అలాగే, వైరల్ వీడియోను గూగుల్ మ్యాప్స్‌లోని చిత్రాలతో పోల్చడం ద్వారా వీడియోలోని లొకేషన్ 2020 వరదలు సంభవించిన ముంబైలోని 18 కవాస్జీ పటేల్ ట్యాంక్ రోడ్ అని నిర్ధారించాం.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఈ వీడియో 2024లో వచ్చిన వరదలను కాకుండా 2020లో ముంబైలో వచ్చిన వరదలను చూపుతోంది.

Credit: Sibahathulla Sakib

Claim Review:ముంబై వరదలకు సంబంధించిన పాత వీడియోలను ఇటీవలిదిగా షేర్ చేశారు
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:Misleading
Next Story