రైలు బోగిలోకి నీరు లీక్ అవుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, వందే భారత్ రైలులో గంగానది ప్రవహిస్తున్న దృశ్యం అంటూ సోషల్ మీడియాలో కొంతమంది వైరల్ గా సర్క్యులేట్ చేస్తున్నారు. వందే భారత్ లో గంగా నది ప్రవాహం అన్న ఒక వీడియో ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది.
వందే భారత్ రైలులోకి నీళ్లు అంటూ ఇదే వీడియోని, తక్కువ నిడివితో ట్విట్టర్లో కూడా షేర్ చేశారు మరొక నెటిజన్.
నిజ నిర్ధారణ :
సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన ఈ వీడియోలో నిజమెంత? ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులర్ అయిన వీడియోలో ఉన్న ట్రైన్ కంపార్ట్మెంట్ ను పరిశీలించి చూసినప్పుడు ప్రయాణికులు పడుకుని జర్నీ చేసేలా ఉన్న బెర్త్ కనిపించింది. వందే భారత్ ట్రైన్లలో స్లీపర్ కోచ్ లు లేవు. చైర్ కార్ సిటింగ్ మాత్రమే ఉంది.
https://en.wikipedia.org/wiki/Vande_Bharat_Express
దీంతో న్యూస్ మీటర్ ఫాక్ట్ చెక్ టీం గూగుల్ కీవర్డ్ సెర్చ్ తో పాటుగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసింది. దీంతో గతంలో జూన్ 29, 2019 రోజున సాయంత్రం 5.50 నిమిషాలకు సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ A1 compartment లో ఈ ఘటన జరిగినట్లు ఒక నెటిజన్ ఇదే వీడియోను పోస్ట్ చేసినట్లుగా న్యూస్ మీటర్ టీం గమనించింది.
దీంతోపాటుగానే అదే వ్యక్తి మరికాసేపటికి అంటే, సాయంత్రం 7.27 నిమిషాలకు మరొక ట్వీట్ కూడా చేశారు. రైల్వే శాఖ తక్షణం స్పందించి, నెక్స్ట్ స్టేషన్ లో లోపాన్ని సవరించారని, దానికి కృతజ్ఞతలు తెలుపుతూ రైల్వే మినిస్ట్రీ కి టాగ్ చేశారు ఆ నెటిజన్.
https://www.indiatvnews.com/news/india-viral-video-water-deluge-in-ac-coach-railways-responds-speedily-532459
"బెంగళూరు - దానాపూర్" సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నాగపూర్ కు చేరుకున్నప్పుడు భారీ గాలివాన కారణంగా ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ drain hole లో ఆకులు పేరుకొని పోవడంతో return air duct పై పడ్డ నీళ్లు, ట్రైన్ బెర్త్ ల మీద లీక్ అయ్యాయి. ప్రయాణికుడు వెంటనే కంప్లైంట్ చేయడంతో, రైల్వేశాఖ అప్రమత్తమై, 90 నిమిషాల్లోనే ఈ సమస్యను పరిష్కరించిందంటూ ఇండియా టీవీ ఈ వార్తను రిపోర్ట్ చేసింది.
సో, గతంలో జరిగిన సంఘటనని ఇప్పుడు జరిగినట్టుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీంతోపాటుగానే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ లో జరిగిన ఈ ఘటనను వందే భారత్ ఎక్స్ప్రెస్లో జరిగినట్టుగా సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ ఫాల్స్ క్లెయిమ్