FactCheck : మునుగోడులో RSS నిజంగానే సర్వే చేసిందా?
Fact-check On RSS Survey Report On Munugode. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం ముగిసింది. ఫలితంపై పార్టీలవారీగా అంతర్గతంగా
By Nellutla Kavitha Published on 1 Nov 2022 10:56 PM ISTమునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం ముగిసింది. ఫలితంపై పార్టీలవారీగా అంతర్గతంగా సర్వేలు మొదలయ్యాయి. ఎన్నికల్లో విజేతగా ఎవరు గెలుస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఫలితాలకు సంబంధించి ఒక సర్వే రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/masooddaa/status/1587351932423012352?s=20&t=DIDmAlHSttP65kVjxQuRKg
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఒక సర్వే చేసిందని, అందులో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజేతగా నిలిచాడని, రెండవ స్థానంలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలిస్తే, మూడవ స్థానం కాంగ్రెస్ కి వచ్చిందని వైరల్గా సర్క్యులేట్ అయింది.
నిజ నిర్ధారణ :
సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన ఆర్ఎస్ఎస్ సర్వేకు సంబంధించి కీవర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ ఫాక్ట్ చెక్ టీం. కీ వర్ట్ సెర్చ్ చేసి చూసినప్పుడు న్యూస్ ఎరీనా ఇండియా అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వైరల్ న్యూస్ కు సంబంధించి ఒక పోస్ట్ ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ ఒక సర్వే చేసిందంటూ వైరల్గా సర్క్యులేట్ అయిన పోస్ట్ నిజమో కాదో తెలీదని, ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ అలాంటి సర్వేలు చేయలేదని, వారి పేపర్లు ఎప్పుడూ లీక్ కాలేదని ట్విట్ సారాంశం.
https://twitter.com/NewsArenaIndia/status/1587336479621386240?s=20&t=DIDmAlHSttP65kVjxQuRKg
మరొకసారి ఆర్ ఎస్ ఎస్ సర్వే ఆన్ మునుగోడు బై పోల్ అని కీ వర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు లభ్యమైంది ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ పేరుతో విడుదల అయిన ఒక లేఖ. ఆర్ఎస్ఎస్ పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి లేఖని వైరల్గా సర్క్యులేట్ చేసి ప్రజలను గందరగోళ పరిచారని, ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ సర్వేలను చేయలేదని, సంస్థాగత రాజకీయాలలో పాలు పంచుకోలేదని ఆ లేఖ సారాంశం.
అయితే వైరల్ గా సర్క్యులేట్ అయిన లెటర్ లో ఆర్ ఎస్ ఎస్ లోగో తో పాటుగా కింద ప్రభారీ అనే సంతకం కూడా ఉంది. అయితే ఆ లేఖను ఖండిస్తూ కాచం రమేష్ పేరుతో విడుదలైన లేఖలో ఆర్ఎస్ఎస్ లోగో కానీ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ సంతకం లేదు. అందుకని మరోసారి న్యూస్ మీటర్ టీం గూగుల్ కీ వర్డ్ సెర్చ్ చేసి చూసింది. ఖండన లేఖను వి ఎస్ కె తెలంగాణ వెబ్ సైట్ ప్రచురించింది.
వి ఎస్ కె అంటే విశ్వ సంవాద కేంద్ర. ఇది ఆర్ఎస్ఎస్ కి సంబంధించి అధికారిక మీడియా సెంటర్.
https://en.wikipedia.org/wiki/Vishwa_Samvad_Kendra
ఈ లేఖనే VSKBharat ట్విటర్ అకౌంట్ కూడా ట్వీట్ చేసింది. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
https://twitter.com/editorvskbharat/status/1587480327022292995?s=20&t=DIDmAlHSttP65kVjxQuRKg
సో, ఆర్ఎస్ఎస్ మునుగోడు ఉప ఎన్నిక మీద సర్వే చేసిందని వైరల్గా సర్క్యులేట్ అయిన క్లెయిమ్ తప్పు.