"మహారాష్ట్రలోని ఒక పొలంలో బోరు వేస్తే పాలు వస్తున్నాయి" అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. "బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా? అనిపిస్తుంది! ఇది చూస్తే" అనే ఈ సందేశంతో ఒక వీడియోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
https://www.facebook.com/chattamtv/videos/vb.993856100743861/532507060949606/?type=2&theater
నిజ నిర్ధారణ :
నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్నట్టుగా మహారాష్ట్రలో బోర్ వెల్ నుంచి పాలు వస్తున్నాయా?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. కీ వర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు 2019లో కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు కనిపించాయి. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ జిల్లాలో ఉన్ననౌరంగ్‌దేసర్ గ్రామంలో జరిగినట్లుగా ఒక నెటిజన్ ఫేస్ బుక్ లో Nov 18, 2019 నాడు పోస్ట్ చేశారు.
ఇక రాజస్థాన్ లో ఉన్న ఒక ట్యూబ్ వెల్ నుంచి పాలు వస్తున్నట్టుగా దీపక్ కుమార్ అనే వ్యక్తి Nov 19, 2019 రోజున యూట్యూబ్ లో ఇదే వీడియో పోస్ట్ చేశారు.
దీంతో మరొకసారి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్, కీ ఫ్రేమ్ అనాలసిస్ చేసి చూసింది న్యూ మీటర్ టీం. దీంతో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో కి సంబంధించి 2:07 నిమిషాల నిడివి ఉన్న ఒక వీడియోను INC News యూట్యూబ్ ఛానల్ Nov 19, 2019 రోజున పబ్లిష్ చేసినట్టు తెలిసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ జిల్లా నౌరంగ్‌దేసర్ గ్రామంలో, రెండేళ్లపాటు పని చేయకుండా ఉన్న బోర్ వెల్ ను రసాయనాలతో శుభ్రం చేసి, తిరిగి కొంతసేపటి తర్వాత స్టార్ట్ చేసినప్పుడు అందులో నుంచి కొంత సేపటి వరకు తెల్లటి నురుగు లాంటి ద్రావణం బయటికి వచ్చినట్టుగా INC News ఈ వీడియోను పోస్ట్ చేసింది. నౌరంగ్‌దేసర్ గ్రామ సర్పంచ్ రాంనివాస్ దీనిని వివరించినట్టుగా రాజస్థాన్ కి చెందిన INC News ( Independent News With Courage) అనే యూట్యూబ్ ఛానల్ పబ్లిష్ చేసింది.
ఇక ఇదే సంఘటనకు సంబంధించి రాజస్థాన్ పత్రిక Dec 14, 2019 రోజున ఒక ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ను ప్రచురించింది. ట్యూబ్ వెల్ నుంచి తెల్లటి నురగలతో పాలు బయటికి వస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన వీడియోలో నిజం లేదంటూ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. కొంతకాలం పాటు వాడకుండా వదిలేసిన బోరింగ్ పైపులను శుభ్రం చేయడానికి వాడిన రసాయన పదార్థాల వల్ల తెల్లటి ద్రవం బయటికి వచ్చిందని, కొద్దిసేపటి తర్వాత సాధారణమైన నీరే ఆ ట్యూబ్ వెల్ నుంచి బయటికి వచ్చినట్టుగా రాజస్థాన్ పత్రిక వివరించింది.
https://www.patrika.com/jaipur-news/fact-check-fake-claims-of-milk-coming-out-of-tubewells-in-bikaner-5482473/
సో, రెండేళ్ల నుంచి వాడకుండా వదిలేసిన బోర్ వెల్ పైపులను రసాయనాలతో శుభ్రం చేసి, తిరిగి వాడటం మొదలు పెట్టినప్పుడు తెల్లటి నురుగు లాంటి నీరు బయటికి వచ్చింది తప్ప బోర్ లో నుంచి పాలు బయటికి రాలేదు. ఇక వైరల్ వీడియోలో చెప్పినట్టుగా ఇది మహారాష్ట్రలోని ఒక పొలంలోని బోరు లోంచి వచ్చింది కూడా కాదు.