Fact Check: బీజేపీ విజయం సాధించిందని మహిళలు మద్యం తాగుతూ ఎంజాయ్ చేశారా?
అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత, మహిళలు కలిసి మద్యం సేవిస్తూ తింటూ ఎంజాయ్ చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Dec 2023 3:15 PM GMTనిజమెంత: బీజేపీ విజయం సాధించిందని మహిళలు మద్యం తాగుతూ ఎంజాయ్ చేశారా?
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత, మహిళలు కలిసి మద్యం సేవిస్తూ తింటూ ఎంజాయ్ చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ మద్దతుదారులు మద్యం సేవిస్తున్నట్లు వీడియోను షేర్ చేస్తున్న వారు చెబుతున్నారు.
“ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో, బీజేపీ మద్దతుదారులు పార్టీలు చేసుకోవడం ప్రారంభించారు...” అనే క్యాప్షన్‌తో ఒక ట్విట్టర్ ప్రీమియం యూజర్ వీడియోను షేర్ చేశారు.
పలువురు సోషల్ మీడియా యూజర్లు అదే వాదనతో వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
ఈ వీడియో కనీసం ఒక నెల పాతదని.. ఇటీవల ముగిసిన ఎన్నికలలో BJP విజయానికి సంబంధించినది కాదని NewsMeter కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ కు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము YouTube ఛానెల్ బంజారా అశ్వితలో అక్టోబర్ 25, 2023న అప్‌లోడ్ చేసిన వీడియోగా గుర్తించాము. వీడియోను “దసరా దావత్” అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
మేము అదే వీడియోను YouTube రీల్‌లో కనుగొన్నాము. అందులో మహిళలు మద్యం తాగడంతో పాటు మాంసాహారాన్ని కూడా తింటున్నట్లు ఆ వీడియోలో చూపుతుంది.
మేము ఈ వైరల్ వీడియో ఉన్న ఛానెల్ ను నిశితంగా పరిశీలించాం. చాలా మంది విందులలో పాల్గొనడం, పలు పాటలకు నృత్యం చేస్తున్న అనేక వీడియోలను కనుగొన్నాము. ఒక వీడియోలో అదే స్త్రీలందరూ కలిసి ఒకే వేషధారణతో ప్రాంతీయ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు.
తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌కు చెందిన బంజారా అశ్విత అనే మహిళ ఈ ఛానల్ ను నడుపుతోందని ఎబౌట్ విభాగం తెలిపింది. ఛానెల్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కూడా అభ్యర్థించారు.
మూడు హిందీ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా తెలంగాణలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. వీడియో కనీసం ఒక నెల పాతదని.. తెలంగాణకు చెందినది కాబట్టి, మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని ప్రజలు సెలెబ్రేట్ చేసుకుంటున్నట్లు ఆ వీడియోలో చూపించలేదని మేము నిర్ధారించాము.