నిజమెంత: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేశాడా?
'ఓటమి భయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని పగలగొట్టారనే వీడియో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 May 2024 3:30 PM GMTనిజమెంత: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేశాడా?
'ఓటమి భయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని పగలగొట్టారు (మలయాళం)’ అనే వాదనతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు వ్యక్తులు పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్)ను ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది.
X వినియోగదారు పోస్ట్ చేసిన 32-సెకన్ల క్లిప్‌లో మలయాళ వార్తా ఛానెల్ ఆసియానెట్ న్యూస్ లోగో ఉంది. (Archive)
నిజనిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సిపి శాసనసభ్యుడు పి. రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అనేక ప్రధాన స్రవంతి న్యూస్ పోర్టల్‌లతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్థానిక న్యూస్ ఛానెల్‌లు కూడా ఈ సంఘటనను నివేదించాయని గుర్తించాం. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేస్తూ ఎమ్మెల్యే పట్టుబడ్డారని ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫిర్యాదు కూడా చేసిందనే వార్తలను కూడా గమనించాం. ఎన్డీటీవీ కూడా ఈ ఘటనను నివేదించింది.
CCTV ఫుటేజీలో, పి. రామకృష్ణారెడ్డి బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించడం, ఓటింగ్ పరికరాన్ని నేలపై విసిరేయడం కనిపిస్తుంది. ఈ ఏడాది మే 13న ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానిక తెలుగు న్యూస్ పోర్టల్ నివేదించింది.
ఆసియానెట్ లోగోతో కూడిన అదే వీడియో వారి యూట్యూబ్ ఛానెల్‌లో ‘ఎన్నికల సంఘం YSRCP ఎమ్మెల్యేపై విచారణకు ఆదేశించింది’ అనే శీర్షికతో పోస్టు పెట్టారు.
అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం (EC) ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించగా, వీడియో వైరల్ అయినప్పటి నుండి పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) సీనియర్ నేత, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ధ్వంసం చేసిన కేసులో జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అరెస్టును తప్పించుకుని తిరుగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 5 వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది.నిజమెంత: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేశాడా?
ఓడిపోతున్నాననే భయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేశారన్న వాదన అవాస్తవం.