FactCheck : భారత క్రికెట్ జట్టు లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ కిడ్నాప్ అయ్యారా?

ఇటీవల, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన X ప్రొఫైల్‌లో ఒక వీడియోను పంచుకున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2023 4:35 PM GMT
FactCheck : భారత క్రికెట్ జట్టు లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ కిడ్నాప్ అయ్యారా?

ఇటీవల, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన X ప్రొఫైల్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. అది ఇంటర్నెట్‌లో కాస్తా వైరల్ గా మారింది. ఆ వీడియోలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ నోట్లో బట్టను ఉంచి, చేయి వెనుకకు కట్టేసి, ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

గంభీర్ తన అకౌంట్ లో “Anyone else received this clip, too? Hope it’s not actually @therealkapildev and that Kapil Paaji is fine! (sic)” అంటూ పోస్టు పెట్టారు. మీకు కూడా ఈ క్లిప్ వచ్చిందా..? కపిల్ దేవ్ జాగ్రత్తగానే ఉన్నారు కదా అంటూ పోస్టు పెట్టారు.

ఈ వీడియోకు కొన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కొందరు నిజంగా కపిల్ దేవ్ కిడ్నాప్ జరిగిందేమోనని కంగారుపడ్డారు.

పలు సోషల్ మీడియా సైట్లలో కూడా ఈ వీడియో వైరల్ అయింది.

నిజ నిర్ధారణ :

ఈ వీడియో.. వైరల్ పోస్టులలో ఎటువంటి నిజం లేదని న్యూస్ మీటర్ గుర్తించింది. వైరల్ వీడియోలో ఉన్నది కపిల్ దేవ్ అని ధృవీకరించాం. అయితే ఇది నిజంగా చేసిన కిడ్నాప్ అయితే కాదు. 2023 వన్డే ప్రపంచ కప్ ప్రమోషన్స్ లో భాగంగా తీసిన వీడియో ఇది.

మేము గంభీర్ యొక్క X ప్రొఫైల్‌ను పరిశీలించడం ద్వారా మా పరిశోధనను ప్రారంభించాము. ఈ కిడ్నాప్ వీడియోకు సంబంధించిన అప్డేట్ లకు సంబంధించి వీడియోను గుర్తించాం. గంభీర్ చేసిన ఒక ట్వీట్‌ని కనుగొన్నాము.

కపిల్ దేవ్ తన సహజమైన నటనను ప్రశంసిస్తూ గంభీర్ ట్వీట్ చేశాడు. “Areh @therealkapildev paaji well played! Acting ka World Cup bhi aap hi jeetoge! Ab hamesha yaad rahega ki ICC Men's Cricket World Cup is free on @DisneyPlusHS mobile. (sic)” అంటూ పోస్టు పెట్టాడు గంభీర్.

Disney+ Hotstar అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా ఇదే వీడియోను మేము గమనించాం. ప్రపంచ కప్ మ్యాచ్ లకు సంబంధించి ప్రోమో వీడియో ఇది. “@therealkapildev paaji ko kidnap kyun karna? #DisneyPlusHotstar hai na! Dekho poora ICC Men's Cricket World Cup bilkul FREE on mobile! Data saver mode ke saath! #ItnaSabFreeKa #WorldCupOnHotstar (sic)” అంటూ పోస్టులు పెట్టడం గమనించవచ్చు. మొబైల్ లో ఉచితంగా ప్రపంచ కప్ ను ఆస్వాదించవచ్చని Disney+ Hotstar ప్రకటించింది.

ICC మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు సాగనుంది. మ్యాచ్ సమయంలో విద్యుత్తు తప్పనిసరిగా ఉండకపోవడంతో గ్రామస్థులు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను అపహరించినట్లు ప్రోమోలో చూపించారు. డేటా సేవర్ మోడ్‌లో మ్యాచ్‌ను డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా చూడవచ్చని పోలీసులు గ్రామస్తులకు తెలియజేస్తారు. అప్పుడు కపిల్ దేవ్ ను గ్రామస్థులు వదిలిపెడతాడు.


కపిల్ దేవ్ క్షేమంగా ఉన్నారు. కిడ్నాప్ కు సంబంధించిన వైరల్ వీడియో Disney+ Hotstar ప్రోమో లోనిది. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

Credits : Sunanda Naik

Claim Review:భారత క్రికెట్ జట్టు లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ కిడ్నాప్ అయ్యారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story