బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు తెలిపారంటూ వీడియో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నట్లు అందులో ఉంది. ఈ వీడియోలో పాకిస్థాన్ జెండా కూడా ఉంది.
“Free now Imran Khan @akshaykumar Support #ImranKhan.” అంటూ పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. వీడియోను ఎడిట్ చేసి, వాయిస్ ను మార్చారని స్పష్టంగా తెలుస్తోంది.
ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతిచ్చే ఆడియో క్లిప్‌ను సూపర్‌ఇంపోజ్ చేయడం ద్వారా వీడియోను ఎడిట్ చేశారని NewMeter కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 12 నవంబర్ 2020న అక్షయ్ కుమార్ ఫ్యాన్ పేజీలో పోస్ట్ చేసిన వీడియోను కనుగొన్నాం. ఆ వీడియోలో వేరే ఆడియో ఉన్నట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియోలో, అక్షయ్ కుమార్ GOQii అనే కంపెనీ స్మార్ట్ ECG పరికరం గురించి మాట్లాడడం మేము గమనించాం.
దీని నుండి క్యూ తీసుకొని, మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. 22 నవంబర్ 2019న GOQii YouTube ఛానెల్ ప్రచురించిన వీడియోలో ఎక్కువ నిడివి ఉన్న వీడియోను కనుగొన్నాము. వీడియో కింద “Akshay Kumar Talks About the GOQii Vital ECG and Heart Health.” అనే టైటిల్ ను ఉంచారు.
“India’s Health Coach Akshay Kumar talks about the importance of heart health, ECG tests and the new GOQii VitalECG.” అంటూ డిస్క్రిప్షన్ ఉంది. అందులో GOQii పరికరం గురించి వివరించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది.
1 నవంబర్ 2020 న హిందూస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం GOQii, Fau-G, PagarBook, CarDekho వంటి స్టార్టప్‌లకు అక్షయ్ కుమార్ మద్దతు తెలుపుతున్నారని తెలిపింది.
అక్షయ్ కుమార్ గతంలో మాట్లాడిన వీడియోలను తీసుకుని.. ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇస్తున్నట్లుగా ఆడియోను డిజిటల్‌గా జోడించారు. వైరల్ వీడియో ఎడిట్ చేశారని.. మేము నిర్ధారించాము. కాబట్టి, వైరల్ వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam