FactCheck : తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని అనుకున్నట్లు ఉద్ధవ్ థాకరే చెప్పారా.?

తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నట్లుగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన చేశారంటూ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 March 2024 8:49 PM IST
FactCheck : తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని అనుకున్నట్లు ఉద్ధవ్ థాకరే చెప్పారా.?

తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నట్లుగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన చేశారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే తన కుమారుడు ఆదిత్య ఠాక్రేని మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నట్లు ఆ ప్రకటనలో ఉంది.

News 24 ట్విట్టర్ హ్యాండిల్ లో ఉద్ధవ్ థాకరే ప్రకటన ఉందని స్క్రీన్ షాట్స్ ద్వారా తెలుస్తోంది. “‘నా కొడుకు ఆదిత్య థాకరేని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నాను" అని శివసేన (UBT) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే చేసిన ప్రకటన అంటూ వైరల్ పోస్టులను తెగ షేర్ చేస్తున్నారు.


Sabse Tej Khabar పేరు మీద కూడా మరో స్క్రీన్ షాట్ వైరల్ అవుతూ ఉంది.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.

ఆయన చేసిన ప్రకటనకు.. పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసిన విధానానికి చాలా తేడా ఉందని.. ఆయన చెప్పిన మాటను వక్రీకరించారంటూ.. పలువురు వినియోగదారులు న్యూస్ 24 పోస్ట్‌పై కామెంట్లు చేయడాన్ని మేము గమనించాము. వారిలో ఒకరు ఆయన ఏ సందర్భంలో మాట్లాడారు.. పూర్తిగా ఏమి చెప్పారనే విషయానికి సంబంధించి వీడియోను కూడా షేర్ చేశారు.

తన కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకున్నా.. ప్రజల మద్దతు, సంకల్పం తప్పకుండా అవసరమని థాకరే చెప్పడం వీడియోలో వినవచ్చు.

శివసేన UBT నాయకురాలు, ప్రియాంక చతుర్వేది.. ఆ ప్రకటనకు సంబంధించి సమాధానం ఇచ్చారు. న్యూస్ 24 ఉద్ధవ్ ప్రకటనను తప్పుగా అన్వయించిందని వివరించారు. అమిత్ షా కొడుకు జై షా బీసీసీఐ లో పదవిని చేజిక్కించుకోవడంపై ఉద్ధవ్ థాకరే విమర్శలు చేశారు. ప్రజల మద్దతు లేకుండా నేను నా కొడుకును ముఖ్యమంత్రిని చేయలేను కదా అని ఆయన అన్నారు.

మేము మార్చి 8న టైమ్స్ నౌ నివేదికను కూడా కనుగొన్నాం. “లోక్‌సభ ఎన్నికలు బీసీసీఐ ఎన్నికలలా కాదు..." అని అన్నారు. ఒక బహిరంగ సభలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ)లో పదవుల నియామకానికి సమానం కాదని అన్నారు. ఆదిత్య ముఖ్యమంత్రి కావాలంటే ప్రజల మద్దతు, సంకల్పం అవసరమని థాకరే చెప్పారని కథనంలో ఉంది.

మహారాష్ట్ర మాజీ సిఎం ఉద్ధవ్ మాట్లాడుతూ "సరే, నేను ఆదిత్యను సిఎంగా చేయాలనుకుంటున్నాను, కానీ మీరందరూ ఆయనను సిఎంగా చేయాలనుకుంటేనే అది జరుగుతుంది. ఆయనను సీఎం చేయడం బీసీసీఐలో చేసినట్లుగా కాదు. అమిత్ షా కొడుకు జై షాను బీసీసీఐకి ఎలా అధ్యక్షుడు చేశాడో అందరికీ తెలుసు" అని అన్నారు.

మార్చి 7న ముంబై టాక్ ప్రచురించిన అదే నివేదికను కూడా మేము కనుగొన్నాము. ఆ నివేదికలో అమిత్ షాపై థాకరే విమర్శలు చేశారు.

అందువల్ల, న్యూస్ 24 నివేదించిన థాకరే ప్రకటన అసంపూర్ణమైనది. ప్రజలను తప్పుదారి పట్టించేదని మేము నిర్ధారించాము.

Credits : Md Mahfooz Alam

Claim Review:తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని అనుకున్నట్లు ఉద్ధవ్ థాకరే చెప్పారా.?
Claimed By:News 24
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:Misleading
Next Story