Fact Check: ముస్లిం మెజారిటీ ఓటర్లు ఉన్న లక్ష్య ద్వీప్ లో బీజేపీకి కేవలం 201 ఓట్లు మాత్రమే వచ్చాయా?
లక్షద్వీప్ ఎన్నికలలో బీజేపీకి కేవలం 201 ఓట్లు మాత్రమే వచ్చాయని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పోస్టులు పెట్టారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Jun 2024 4:22 PM GMTFact Check: ముస్లిం మెజారిటీ ఓటర్లు ఉన్న లక్ష్య ద్వీప్ లో బీజేపీకి కేవలం 201 ఓట్లు మాత్రమే వచ్చాయా?
Fact Check: ముస్లిం మెజారిటీ ఓటర్లు ఉన్న లక్ష్య ద్వీప్ లో బీజేపీకి కేవలం 201 ఓట్లు మాత్రమే వచ్చాయా?2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత.. లక్షద్వీప్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) కేవలం 201 ఓట్లు మాత్రమే వచ్చాయని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పోస్టులు పెట్టారు.
లక్షద్వీప్ అనేది భారతదేశ ప్రధాన భూభాగంలోని నైరుతి తీరంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం (UT). కేంద్ర ప్రభుత్వం లక్షద్వీప్ పాలన సాగిస్తూ ఉంటుంది. లక్షద్వీప్‌లో 96 శాతం ముస్లిం జనాభా ఉండడంతో అక్కడ బీజేపీకి తక్కువ ఓట్లు రావడానికి కారణమని పలువురు ఆరోపించారు.
"ముస్లింలు 96% ఉన్న లక్షద్వీప్‌లో బీజేపీకి కేవలం 201 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముస్లింలు అభివృద్ధికి అనుకూలంగా లేరని స్పష్టంగా తెలియజేస్తోంది. అబ్దుల్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంత చేసినా, అతను ఓటు వేయడు అనేది నిజం, ” అంటూ ఒక X వినియోగదారు పోస్టు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. 2024లో లక్షద్వీప్‌లో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. 2024లో లక్షద్వీప్‌లో అభ్యర్థిని నిలబెట్టిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్ వర్గంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. కాబట్టి ఈ వాదన తప్పుదారి పట్టించేదని NewsMeter కనుగొంది.
ఈ వాదనకు సంబంధించి మేము కీవర్డ్ సెర్చ్ ను ప్రారంభించాము. జూన్ 4 నాటి ది హిందూ నివేదికను మేము కనుగొన్నాము. ఆ నివేదిక ప్రకారం, లక్షద్వీప్‌లో ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీ, BJP నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మధ్య ఉంది.
చివరికి, 2024లో లక్షద్వీప్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముహమ్మద్ హమ్దుల్లా సయీద్ గెలుపొందారు. ప్రస్తుత ఎంపీ, NCP-SPకి చెందిన మహ్మద్ ఫైజల్ పడిప్పురా 2,647 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్‌సిపికి చెందిన యూసఫ్ టిపికి కేవలం 201 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని లక్షద్వీప్‌లో బీజేపీకి వచ్చిన ఓట్ల లెక్కింపు అని చాలా మంది తెలిపారు.
మేము ఇదే విషయాన్ని భారత ఎన్నికల సంఘం (ECI) వెబ్‌సైట్ ను పరిశిలించి ధృవీకరించాము.
లక్షద్వీప్ ఫలితాలపై ECI డేటా ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి ముహమ్మద్ హమ్దుల్లా సయీద్‌కు 25,726 ఓట్లు, ఎన్‌సిపి-ఎస్‌పి అభ్యర్థి మహ్మద్ ఫైజల్‌కు 23,079 ఓట్లు, ఎన్‌సిపి అభ్యర్థి యూసుఫ్ టిపికి 201 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి కోయాకు 61 ఓట్లు వచ్చాయి.
ఈ తప్పుడు వార్తలు ఎలా బయటకు వచ్చాయి:
ఈ ఏడాది జనవరి 4న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన X ఖాతాలో ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో స్నార్కెలింగ్ చేసిన చిత్రాలను, అందమైన బీచ్ ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ చర్య ఓట్లను ఆకర్షించడానికి, లక్షద్వీప్‌ను ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి బీజేపీ వ్యూహంలో భాగమని అన్నారు.
లక్షద్వీప్ పరిపాలన యంత్రాంగానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్‌లో ముస్లిం జనాభా 93 శాతానికి పైగా ఉంది. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా లక్షద్వీప్ గురించి ప్రచారం చేసినా అక్కడ BJP ఎటువంటి లాభం పొందలేకపోయిందని నెటిజన్లు వాదించారు.
అయితే, లక్షద్వీప్‌లో బీజేపీ నేరుగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదని మేము గుర్తించాం. ఆ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదని మేము నిర్ధారించాము.