ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను బెదిరిస్తున్నట్లు ఉంది. తనకు వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిని అణిచివేస్తానని చెప్పడం వినవచ్చు.
"నాపై నిరసన తెలిపితే చితకబాదిస్తాను. గుజరాతీలు! మీకు చేతనైతే నన్ను ఆపండి" అని సీఎం అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోస్ట్‌లను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదు.
NewsMeter బృందం కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ధృవీకరించబడిన YouTube ఛానెల్‌లో వైరల్ వీడియో కనిపించింది. అందుకు సంబంధించిన పూర్తి వెర్షన్‌ను కనుగొన్నాం. "అరవింద్ కేజ్రీవాల్ సూరత్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు" "Arvind Kejriwal addresses people at Surat" అనే శీర్షికతో ఆ వీడియో 18 అక్టోబర్ 2016న అప్‌లోడ్ చేయబడింది.
వీడియో నిడివి 31:01 నిమిషాలు కాగా.. వైరల్ క్లిప్ 14:50 నిమిషాల మార్క్‌లో కనిపిస్తుంది. మీరు 14 నిమిషాల సమయం ఫ్రేమ్ నుండి వీడియోను చూస్తే, అరవింద్ కేజ్రీవాల్ వాస్తవానికి హోం మంత్రి అమిత్ షాపై విరుచుకుపడుతున్నారని తెలుస్తుంది. గుజరాత్‌లో ఆయన తన ప్రసంగంలో నియంతృత్వాన్ని ఎదిరిస్తూ ఉన్నారని తెలుసుకోవచ్చు.
బీజేపీ నాయకుడు ప్రషన్ ఉమ్రావ్ 2021లో వైరల్ వీడియోను ట్వీట్ చేశారు.
ఇదే క్లిప్‌ను గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వి 19 ఫిబ్రవరి 2021న ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "కేజ్రీవాల్ జీ మీరు గుజరాత్‌ను ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారు?" అని రాశారు.
ఆప్ గుజరాత్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ "స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయి భయపడిన బీజేపీ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అరవింద్ కేజ్రీవాల్ జీ వీడియోను ఎడిట్ చేయడం ప్రారంభించింది" అని ట్వీట్ చేసింది. గుజరాత్‌లో అమిత్ షా పాలనపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారని, గుజరాత్ ప్రజలను బెదిరించలేదని చెబుతూ అసలైన వీడియోను కూడా జత చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను బెదిరించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉంది.