FactCheck : దీపికా పదుకోన్ పఠాన్ సినిమా వివాదం తర్వాత కావాలనే కాషాయరంగు చెప్పులను ధరించిందా..?
Deepika did not wear saffron shoes to mock people protesting against Pathaan. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా 'పఠాన్'.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Jan 2023 5:59 PM ISTతాజాగా దీపికాకు సంబంధించి మరో ఫోటోను వైరల్ చేస్తూ ఉన్నారు. దీపికా పఠాన్ సినిమా వివాదం అనంతరం కావాలనే కాషాయ రంగు చెప్పులను ధరించిందని చెబుతూ వచ్చారు. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ కాషాయ రంగు హై హీల్స్ ధరించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జనవరి 25న విడుదల కానున్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ నటించిన 'పఠాన్'కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలను ఎగతాళి చేసేందుకు నటి ఆ రంగు చెప్పులను కావాలనే ధరించిందని ఫోటోను షేర్ చేస్తున్నారు.
"బేషరమ్ రంగ్" పాట విడుదలైన తర్వాత కొన్ని సంఘాలు సినిమాకు వ్యతిరేకంగా బాయ్ కాట్ ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ పాట "హిందూ మనోభావాలను" దెబ్బతీస్తోందని వారు ఆరోపించారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న ఫోటోకు.. ఇప్పటి వివాదానికి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది.
2019లో ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు దీపిక హాజరైనప్పటి ఫోటోగ్రాఫ్ అని న్యూస్‌మీటర్ కనుగొంది.
ఫోటో రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించినప్పుడు, మేము 2019 నుండి అనేక నివేదికలలో ఈ వైరల్ ఫోటోను కనుగొన్నాము. 17 మే 2019న ప్రచురించిన వోగ్ మ్యాగజైన్ లోని ఒక కథనం ప్రకారం, 2019లో జరిగిన 72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి దీపిక లుక్‌లలో ఇది ఒకటి.
దీపిక పదుకోన్ స్టైలిస్ట్ షాలీనా నథాని కూడా 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను పోస్ట్ చేసారు. #cannes2019 అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించారు.
ఈ ఫోటో 2019 నాటిది అని స్పష్టంగా తెలుస్తుంది. 'పఠాన్'కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిని ట్రోల్ చేసేందుకు దీపిక కాషాయ రంగు చెప్పులు ధరించిందన్న వాదన తప్పుదోవ పట్టించేదని మేము నిర్ధారించాము.