మీడియా అవుట్‌లెట్ న్యూస్ 18లో పనిచేస్తున్న హిందీ న్యూస్ టెలివిజన్ యాంకర్ అమీష్ దేవగన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 11విన్నర్ అనే క్యాసినో గేమింగ్ యాప్ గురించి దేవగన్ రిపోర్టింగ్ చేస్తున్నట్లు ఇది చూపిస్తుంది.
వీడియో దిగువన గ్రాఫిక్ టెక్స్ట్ లో 300,000,000 రూపాయలను మొబైల్ యాప్‌ని ఉపయోగించి ముంబై వాసి జాక్‌పాట్ కొట్టాడని అందులో ఉంది. గేమింగ్ అప్లికేషన్‌లో డబ్బు ఎలా సంపాదించవచ్చో అందులో వివరించారు. యాప్‌లో గెలిచిన వాళ్లు.. స్పోర్ట్స్ కారు, రెండు అంతస్తుల ఇంటిని కొనుగోలు చేసిన వినోద్ షిండే అనే వ్యక్తి కథను వివరిస్తూ ఒక మహిళ ఆడియోను కూడా మనం వినవచ్చు.
హౌస్‌హోల్డర్ సిల్వానా అనే ఫేస్‌బుక్ పేజీ ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. Google Play స్టోర్‌లో 11విన్నర్ - క్యాసినో, పట్టీ, రమ్మీ, క్రికెట్, గేమింగ్ యాప్‌కి లింక్‌ను కూడా కలిగి ఉంది.
నిజ నిర్ధారణ :
కాసినో గేమింగ్ అప్లికేషన్‌ల ప్రయోజనాలను దేవగన్ ఎప్పుడూ నివేదించలేదని NewsMeter ధృవీకరించింది. వాయిస్ క్లోనింగ్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి రూపొందించిన డీప్‌ఫేక్ వీడియో అని తెలుస్తోంది.
మేము ఆడియో, పెదవుల కదలికల మధ్య ఎటువంటి సింక్ లేదని గమనించాము. ఇది వీడియో నకిలీదని మాకు క్యూ ఇచ్చింది. మేము దేవగన్ సోషల్ మీడియా ఖాతాలను (X ఖాతా, Facebook ఖాతా, Instagram).. News 18 (X ఖాతా, Facebook ఖాతా, Instagram) ఖాతాలను కూడా తనిఖీ చేసాము. అయితే యాప్‌ను ప్రమోట్ చేసే పోస్ట్‌లు లేదా కథనాలు ఏవీ కనుగొనలేదు.
మేము News18 యూట్యూబ్ ఛానెల్‌ని స్క్రోల్ చేసాము. దేవగన్ షో అయిన 'ఆర్ పార్ విత్ అమిష్ దేవగన్' వీడియోను ఆ ఛానెల్ జనవరి 4, 2024న ప్రచురించింది. ఆ వీడియోలో యాంకర్‌ను అదే సూట్‌లో ఉన్నట్లు మేము గుర్తించాం. అతని హావభావాలను కూడా మేము గమనించాము. వీడియో ప్రారంభ 0.12 సెకన్ల సమయంలో వైరల్ వీడియోతో సమానంగా ఉన్నాయి.
ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై ఆయన మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.
రెండింటి మధ్య పోలికలను చూపే కీఫ్రేమ్‌లను ఇక్కడ మనం చూడొచ్చు.
అందువల్ల, అమిష్ దేవగన్ క్యాసినో గేమింగ్ అప్లికేషన్ కు సంబంధించిన వైరల్ వీడియో డీప్‌ఫేక్ అని మేము నిర్ధారించాము.
పలువురు ప్రముఖులు బెట్టింగ్ యాప్‌లను 'ఎండార్సింగ్' చేస్తున్నట్లుగా డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తూ ఉన్నారని న్యూస్‌మీటర్ గుర్తించింది. ప్రజలను మోసం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై న్యూస్‌మీటర్ ఒక వివరణాత్మక నివేదికను ప్రచురించింది.
Credits : Md Mahfooz Alam