2023 ఐసిసి ప్రపంచ కప్ ట్రోఫీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియన్ డిప్యూటీ పిఎం రిచర్డ్ మార్లెస్ నుండి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ అందుకున్నాడు. అయితే కమిన్స్ ప్రపంచ కప్ ను పట్టుకుని ఒంటరిగా నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచ కప్ విజయం సాధించినందుకు కమిన్స్‌ను అభినందించకుండా ప్రధాని మోదీ అవమానించారని వీడియోను కొందరు షేర్ చేశారు. ఒక పాకిస్తానీ జర్నలిస్ట్, వజాహత్ కజ్మీ, ప్రీమియం X ఖాతాలో వీడియోను పంచుకున్నారు, “భారతదేశం తనను తాను అత్యంత అవమానకరమైన హోస్ట్ అని నిరూపించుకుంది! (sic)” అంటూ పోస్టులు పెట్టాడు.
పలువురు నెటిజన్లు అదే వాదనతో ఈ వీడియోను షేర్ చేసుకున్నారు.
నిజ నిర్ధారణ :
ప్రధాని నరేంద్ర మోదీ ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను అభినందించే భాగాన్ని ఎడిట్ చేసి వీడియోను షేర్ చేశారని న్యూస్‌మీటర్ కనుగొంది.
కజ్మీ పోస్ట్‌ను పరిశీలించగా.. కామెంట్స్ విభాగంలో ఓ వినియోగదారు పోస్ట్ చేసిన మరో వీడియోను మేము కనుగొన్నాము. ట్రోఫీని ప్రదానం చేసిన తర్వాత కమిన్స్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియన్ డిప్యూటీ పిఎం కరచాలనం చేస్తూ ఉండడం అందులో ఉంది.
మరో X వినియోగదారు కార్తీక్ రెడ్డి.. వేదికపై నుండి దిగిన తర్వాత ఇద్దరు నాయకులు ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లను పలకరిస్తున్నట్లు చూపించే మరో వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ట్రోఫీని అందించిన తర్వాత కూడా ఆస్ట్రేలియన్ కెప్టెన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపిన పలు చిత్రాలను వార్తా సంస్థ ANI కూడా షేర్ చేసింది.
ఇరు దేశాల నాయకులు వేదికపై ఉండగానే.. మిగిలిన ఆస్ట్రేలియన్ జట్టు కమిన్స్ దగ్గరకు రావడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుందని News.com.au నివేదించింది.
కాబట్టి, వైరల్ వీడియో క్లిప్ ఎడిట్ చేశారని.. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా కెప్టెన్ ను అభినందించారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam