Fact Check : సీతాదేవి పాదముద్రలు, నరసింహస్వామి విగ్రహం ఉన్న గుట్ట దగ్గర శిలువను ఏర్పాటు చేస్తున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణల్లో నిజమెంత..?

BJP leader's claim about cross, Narasimha Swami Idol located on same hillock is false. నరసింహ స్వామి ఆలయం ఉన్న కొండకు దగ్గరలోనే పెద్ద శిలువ ఏర్పాటు చేశారంటూ పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు పోస్టులు పెట్టారు.

By Medi Samrat
Published on : 4 March 2021 9:22 AM IST

BJP leaders claim about cross, Narasimha Swami Idol located on same hillock is false

ఆంధ్రప్రదేశ్ లోని ఎడ్లపాడు వద్ద నరసింహ స్వామి ఆలయం ఉన్న కొండకు దగ్గరలోనే పెద్ద శిలువ ఏర్పాటు చేశారంటూ పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు పోస్టులు పెట్టారు.

గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సీతాదేవి పాదముద్రలు, నరసింహస్వామి విగ్రహం ఉన్న ఓ గుట్టను కొందరు ఆక్రమించుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎడ్లపాడులో భారీగా అక్రమ కట్టడాలు సాగుతున్నాయని వీర్రాజు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. ఇదంతా అధికార యంత్రాంగం, జగన్ సర్కారు మద్దతుతోనే ఇదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు. అందులో పెద్ద శిలువను ప్రతిష్టిస్తున్న ఫోటోలను గమనించవచ్చు. ప్రముఖ బీజేపీ నేత సునీల్ దియోధర్ కూడా ఈ ఫోటోలను పోస్టు చేశారు.


''సీతమ్మ పాద ముద్రలు, నరసింహ స్వామి వెలసిన కొండను మాత మార్పిడి మాఫియా ఆక్రమించింది. అక్కడ అక్రమంగా ఓ శిలువను ఏర్పాటు చేశారు. జగన్ ప్రభుత్వం హయాంలో హిందువుల ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో హిందువులకు స్థానం లేదు'' అని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

ఈ ఫోటోలు ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్ లోనూ వైరల్ అవుతూ ఉన్నాయి. ఎడ్లపాడు వద్ద నిర్మిస్తున్నారంటూ పలువురు పోస్టులు పెట్టారు.



నిజ నిర్ధారణ:

గుంటూరు జిల్లా యడ్లపాడులో సీతమ్మ పాదాల చెంతన శిలువ నిర్మాణం చేపట్టారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

ఈ వార్తలను గుంటూరు పోలీసులు కూడా ఖండించారు. గుంటూరు జిల్లా యడ్లపాడులో సీతమ్మ పాదాల చెంతన శిలువ నిర్మాణం చేపట్టారని సోషల్ మీడియాలో బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సునీల్ డియోధర్ కొన్ని ఫోటోలను వైరల్ చేయడంపై గుంటూరు రూరల్ పోలీసులు స్పందించారు. ఇందులో నిజం లేదని వారు నిర్ధారించారు. యడ్లపాడులో రెండు వేర్వేరు కొండలపై సీతమ్మ పాదాలు, శిలువ ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఓ వీడియోను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు.


నరసారావుపేట సబ్ కలెక్టర్ కూడా ఇందుకు సంబంధించి ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. బీజేపీ నేతలు ఆరోపిస్తున్న చోట అన్యమతాలకు చెందిన ఎటువంటి నిర్మాణాలు కూడా జరగలేదని తెలిపారు.

ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ఆర్.సి.ఎం. చర్చ్ పెద్ద శిలువను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాన్ని కోరిందని.. కానీ ప్రభుత్వం నుండి ఇంకా అనుమతులు రాలేదని తెలిపారు. ఇక అనుమతులు రాకుండానే శిలువను ఏర్పాటు చేస్తున్న ఆర్.సి.ఎం. చర్చ్ కు నోటీసులు పంపారని పోలీసు కమిషనరేట్, తహశీల్దారు కార్యాలయానికి చెందిన అధికారులు తెలిపారు.

నరసింహ స్వామి గుడి ఉన్న ప్రాంతానికి ఈ శిలువ ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి అర కిలోమీటర్ కు పైగా దూరం ఉందని పోలీసులు తెలిపారు. ఈ వదంతులను ఆపాలని కూడా ప్రజలకు హితవు పలికారు.


ఈ వార్తల్లో నిజం లేదంటూ పలు మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి.

https://www.thenewsminute.com/article/bjp-member-claims-cross-erected-ap-hillock-hindu-shrine-cops-bust-fake-news-144500

https://www.siasat.com/cross-on-andhra-hillock-rouses-bjp-ire-2101858/

గుంటూరు జిల్లా యడ్లపాడులో సీతమ్మ పాదాల చెంతన శిలువ నిర్మాణం చేపట్టారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పచ్చి అబద్ధం.


Claim Review:సీతాదేవి పాదముద్రలు, నరసింహస్వామి విగ్రహం ఉన్న గుట్ట దగ్గర శిలువను ఏర్పాటు చేస్తున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణల్లో నిజమెంత..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter, Facebook
Claim Fact Check:False
Next Story