కేంద్ర ప్రభుత్వం 30,000 రూపాయల స్కాలర్ షిప్ ను ఇస్తోందని చెబుతూ ఓ లింక్ వైరల్ అవుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం "నేషనల్ స్కాలర్‌షిప్ 2022"ని ప్రకటించిందని పేర్కొంటూ ఒక సందేశం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాలేజీ విద్యార్థులకు 30,000రూపాయల నుండి లక్ష రూపాయల వరకు స్కాలర్‌షిప్‌లు పొందవచ్చని వైరల్ మెసేజీ చెబుతోంది.
నిజ నిర్దారణ :
వైరల్ అవుతున్న మెసేజీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఉంది.
వైరల్ మెసేజీలో ఎన్నో వ్యాకరణ దోషాలు ఉన్నాయని మా టీమ్ గుర్తించింది. 'Hi' అనే పదాన్ని 'Hai' అని.. 'college' ను 'collage' అని అందులో రాశారు.
వైరల్ సందేశానికి జోడించబడిన లింక్‌లో చిన్న URL (bit.ly) ఉందని కూడా మేము గమనించాము. లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత, మేము "leading source for domains" అని చెప్పుకునే HugeDomains వెబ్‌సైట్‌కి మళ్లించబడ్డాము. మేము వెబ్‌సైట్‌కి వెళ్లినప్పుడు లింక్ మార్చబడింది.
PIB ఫాక్ట్ చెక్ ఆంధ్రప్రదేశ్ 24 జూన్ 2020న ఇలాంటి వాట్సాప్ సందేశాన్ని నమ్మకండని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం అటువంటి స్కాలర్‌షిప్ ఏదైనా ప్రకటించిందా అని మేము శోధించాము. భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అలాంటి పథకం ఏదీ కనుగొనబడలేదు. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి వార్తలు నివేదించబడలేదు. వైరల్ సందేశం ద్వారా చేసిన దావా బూటకమని స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్కాలర్‌షిప్‌ను ప్రకటించలేదు. ఈ సందేశం 2020 నుండి ప్రచారంలో ఉంది. ఇలాంటి లింక్ ల మీద క్లిక్ చేసి మీ డేటాను ఇతరుల చేతుల్లోకి పంపించకండి.