బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయకుంటే నిరాహారదీక్ష చేస్తానని సామాజిక కార్యకర్త అన్నా హజారే చెప్పారని పేర్కొంటూ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
''ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేయకుంటే నేను సకినాకా రైల్వే స్టేషన్‌లో నిరాహారదీక్ష చేస్తాను'' అని అన్నా హజారే చెప్పినట్టు ట్వీట్ వైరల్ అయింది.("If Devendra Fadnavis is not made CM this time then I will start a hunger strike at SakiNaka railway station.")
చాలా మంది ట్విటర్ యూజర్లు పీటీఐ నిజంగా పోస్ట్ చేసిందని నమ్మి ట్వీట్‌ను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం.. PTI అధికారిక ట్విట్టర్ ఖాతాను శోధించింది. అందులో ఇలాంటి ట్వీట్ ఏదీ కనుగొనబడలేదు. దేవేంద్ర ఫడ్నవీస్‌ను మహారాష్ట్ర సీఎంగా చేయకుంటే నిరాహారదీక్ష చేస్తానని హజారా అన్నట్లుగా ఏ మీడియా సంస్థ కూడా నివేదించలేదు.
వైరల్ ట్వీట్‌లో వినియోగదారుడి పేరు "@ZackRhea"గా పేర్కొనబడిందని మా బృందం గమనించింది. అయితే PTI యొక్క అధికారిక ధృవీకరించబడిన ట్విట్టర్ హ్యాండిల్ పేరు "@PTI_News."
బృందం "@ZackRhea" ఖాతాను తనిఖీ చేసింది. PTIని అనుకరిస్తున్న ఈ ప్రొఫైల్ బయోలో పేరడీ ఖాతా అని స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతం వినియోగదారు ఖాతా పేరు, ప్రొఫైల్ చిత్రాన్ని మార్చారు.
అంతేకాకుండా.. ముంబైలోని అంధేరీ ఈస్ట్‌లో ఉన్న సాకి నాకాలో రైల్వే స్టేషన్ లేదు. కేవలం మెట్రో స్టేషన్ మాత్రమే ఉంది. పేరడీ ఖాతా ద్వారా ఈ ట్వీట్ చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.