ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా స్టేజీ దిగుతూ జారిపడ్డారు. ఈ ఘటన ఇటీవల అమిత్ షా కలకత్తాలో ర్యాలీ కోసం వెళ్ళినప్పుడు చోటు చేసుకున్న ఘటన అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.
''Amit Shah fell off the stage while running after seeing farmers in Kolkata rally.'' అమిత్ షా రైతులను చూడగానే కంగారు పడ్డారని.. ఆ సందర్భంలో కిందకు పడిపోయారు అంటూ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
న్యూస్ మీటర్ ఈ వీడియోను సెర్చ్ చేయగా ఈ ఘటన 2018 సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుందని స్పష్టంగా తెలుస్తోంది.
"Amit Shah Falling" అనే కీవర్డ్స్ ను ఉపయోగించగా ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు కనిపించాయి. ఈ రిపోర్టులన్నీ 2018 సంవత్సరంలో చోటు చేసుకున్నావంటూ వచ్చాయి. అంతేకానీ ఇటీవల చోటు చేసుకుంది అంటూ ఏ మీడియా సంస్థ కూడా కథనాన్ని వెల్లడించలేదు.. ఎటువంటి వీడియోను కూడా అప్లోడ్ చేయలేదు.
వీడియోలో ఉన్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2018 సంవత్సరంలో చోటు చేసుకుంది. TIMES OF INDIA మీడియా సంస్థ " BJP president Amit Shah falls off stage during a rally in Madhya Pradesh" అంటూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. 2018 సంవత్సరంలో అశోక్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
NDTV మీడియా సంస్థ కూడా ఈ ఘటనకు సంబంధించి " BJP Chief Amit Shah Falls During Madhya Pradesh Roadshow, Escapes Unhurt" వీడియోను పోస్టు చేసింది. రోడ్ షోలో భాగంగా అమిత్ షా ఓ వాహనం నుండి దిగబోయారు. ఇంతలో జారిపడగా.. పక్కనే ఉన్న బాడీగార్డ్స్ సపోర్ట్ ఇచ్చారు. ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి గాయాలు అవ్వలేదు.. వెంటనే లేచి నిలబడ్డారు.
ఇటీవల కలకత్తాలో చోటు చేసుకున్న ఘటన అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో 2018 సంవత్సరం.. మధ్యప్రదేశ్ కు చెందినది.