Fact Check : కాంగ్రెస్ పాలనపై అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గ్యారిసన్ వేసిన కార్టూన్ అంటూ వీడియో వైరల్..!
American cartoonist Ben Garrison. భారత పటం ఆకారంలో ఉన్న ఆకును ఓ ఆవు తింటూ ఉండగా.. పాలు ఒక పాత్రలో.. పేడ మరొక పాత్రలో
By Medi Samrat Published on 8 Dec 2020 6:44 AM GMT
భారత పటం ఆకారంలో ఉన్న ఆకును ఓ ఆవు తింటూ ఉండగా.. పాలు ఒక పాత్రలో.. పేడ మరొక పాత్రలో ఉండడాన్ని గమనించవచ్చు. ఆ ఆవు మీద కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఉండగా.. పాలు పడుతున్న పాత్ర మీద గాంధీ కుటుంబం అని ఉంది.. పేడ ఉన్న పాత్ర మీద 'భారతీయుల కోసం' అని ఉంది. ఈ కార్టూన్ ను అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గ్యారిసన్ గీశారు అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలిశాయి.
మరో పోస్టులో అదే ఆవు మీద బీజేపీ అని ఉండగా.. పాలు ఉన్న పాత్ర మీద అంబానీ కుటుంబం అని ఉంది.
అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గ్యారిసన్ గీశారు అంటూ పలువురు ఈ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గ్యారిసన్ ఈ కార్టూన్ ను గీశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఈ ఒరిజినల్ ఫోటోను మొదట సెప్టెంబర్ 2015న అమల్ మేధి అనే ఆయన పోస్టు చేశారు. అమల్ మేధి ఓ పొలిటికల్ కార్టూనిస్ట్. ఒరిజినల్ కార్టూన్ ను అమల్ మేధి గీశారని అర్థం అవుతుంది. ఒరిజినల్ ఫోటోలో పాలు 'విదేశీ పెట్టుబడిదారులు' అనే పాత్రలో ఉండగా.. పేడ భారతీయుల కోసం అని ఉంది. భారత దేశంలోని రాజకీయాలపై ఆయన పలు కార్టూన్ లను వేశారు.
ఈ కార్టూన్ కు మార్ఫింగ్ చేసి పలు పొలిటికల్ పార్టీలకు వ్యతిరేకంగా షేర్ చేస్తూ ఉన్నారు.
ఇక బెన్ గ్యారిసన్ తాను భారతదేశ రాజకీయాలపై ఎటువంటి కార్టూన్ వేయలేదని ట్విట్టర్ ద్వారా 2017 లోనే తెలిపారు. కానీ అప్పటి నుండి ప్రచారంలోనే ఉంది.
No- I have never drawn any cartoons on India politics- there are some cartoons with my sig going around- Not mine
ఇదే కార్టూన్ విషయంలో పలు నిజ నిర్ధారణ సంస్థలు బెన్ గ్యారిసన్ ఈ కార్టూన్ వేయలేదని ధృవీకరించాయి. ఇలాంటి ఓ కార్టూన్ విషయంలో న్యూస్ మీటర్ కూడా జులై 2020న నిజ నిర్ధారణ చేసింది.