ఇరవై ఆరే్ళ్ల వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డిని అత్యంత కిరాతకంగా రేప్ చేసి, చంపిన సంఘటన తరువాత మహిళల భద్రత విషయంలో మరో మారు చర్చ చెలరేగుతోంది. కొందరు ఈ దుర్ఘటన పై నిప్పులు చెరుగుతున్నారు. ఇంకొందరు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మహిళలు ఏం చేయవచ్చో చెబుతూ సలహాలను ఇస్తున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు మహిళ తనను తాను ఎలా కాపాడుకోవాలో, ఏ నంబర్ కు ఫోన్ చేసి సహాయం కోరవచ్చో కూడా చెబుతున్నారు.

అలాంటి ఒక మెసేజ్ లో “ఈ నిర్భయ నంబర్ ను మీ భార్యకు, కూతుళ్లకు, చెల్లెళ్లకు, తల్లులకు, మిత్రులకు, మీకు తెలిసిన మహిళలందరికీ పంపండి. ఈ నంబర్ ను సేవ్ చేసుకొమ్మని చెప్పంది. మగవారు ఈ నంబర్ ను తమకు తెలిసిన మహిళలందరితో షేర్ చేయండి. అత్యవసర పరిస్థితిలో మహిళలు ఈ నంబర్ కు బ్లాంక్ మెసేజ్ చేయవచ్చు. లేదా మిస్డ్ కాల్ చేయవచ్చు. మీరెక్కడున్నారో పోలీసులకు తెలిసిపోతుంది” అని చెబుతూ + 91 9833312222 అన్న నంబర్ ను కూడా ఇవ్వడం జరిగింది.

ఇలాగే తాజాగా బయటకి వచ్చిన ఇంకో వాట్సప్ మెసేజ్ లో “ తెలంగాణ మిత్రులారా…ఈ నంబర్లను యాడ్ చేసుకొండి. ఇవి షీ టీమ్ ఫోన్ నంబర్ – 040- 27852355. వాట్సప్ నంబర్ 9490616555. పోలీసు సహాయం కోసం మహిళలందరికీ ఈ నంబర్ ను షేర్ చేయండి.

Fact Check

కానీ నిజానిజాలేమిటి?

ఇప్పుడు ఇలాంటి మెసేజ్ లు సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సప్ లో వైరల్ అవుతున్నాయి. అయితే టీమ్ న్యూస్ మీటర్ దీనిపై దర్యాప్తు చేసింది. మొదటి నంబర్ ను గవర్నమెంట్ రైల్వే పోలీసులు 2015 లో ప్రారంభించారని తేలింది. ఈ నంబర్ కు మహిళల భద్రత విషయంలో మెసేజిలు, ఫోటోలు, విడియోలు వాట్సప్ ద్వారా పంపవచ్చు. అయితే ఈ నంబర్ ముంబాయిలో మాత్రమే పనిచేస్తుంది. హైదరాబాద్ లేదా ఇతర నగరాల్లో ఇది పనిచేయదు.

Fact2

ఇలాగే రెండో మెసేజ్ లో రెండు నంబర్లున్నాయి. ఒకటి లాండ్ లైన్ నంబర్. రెండోది వాట్సప్ నంబర్. ఈ నంబర్లను చెక్ చేస్తే వీటిని హైదరాబాద్ పోలీస్, షీ టీమ్స్ షేర్ చేసుకుంటున్నాయని తేలింది.

Fact3

ఇలాంటిదే మరో మెసేజ్. ఈ మెసేజ్ లో తెలంగాణ లోని షీ టీమ్స్ ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ ఐడీలు ఇవ్వడం జరిగింది.

ముందు జాగ్రత్త మంచిదే. సమాచారాన్ని చేరవేసి ప్రాణాలను కాపాడాలన్న తపన కూడా మంచి ఆలోచనే. కానీ మనం పంపుతున్న మెసేజ్ ల తాలూకు నిజానిజాలేమిటన్నది ముందుగా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. కాబట్టి రెండవ మెసేజ్ లో ఇచ్చిన 040-27852355, వాట్సప్ నంబర్ 9490616555 నంబర్లు కరెక్టు. మొదటి మెసేజ్ లో ఇచ్చిన నంబర్ తప్పు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.