నిజ నిర్ధారణ (Fact Check): కమలేశ్ తివారి హత్య జరిగాక అసదుద్దిన్ ఒవైసీ డ్యాన్స్ చేసాడా???
By సత్య ప్రియ Published on 24 Oct 2019 6:49 AM GMTసుదర్శన్ చవహంకే, సుదర్శన్ న్యుస్ టివి చానెల్ మానేజింగ్ డైరెక్టర్, ఏఐఎంఐఎం పార్టీ నేత అసదుద్దిన్ ఒవైసీ కి చెందిన ఒక వీడియో విడుదల చేసారు. హిందూ సమాజ్ పార్టీ నేత కమలేశ్ తివారి హత్య గురించి తెలిసాక ఒవైసి డ్యాన్స్ చేసాడు అని ఆ వీడియోలో దావా చేసారు.
సుదర్శన్ న్యుస్ టివి చానల్ లో ప్రసారం అయ్య బిందాస్ బోల్ అనే కార్యక్రమంలో ఆయన ఈ దావా చేసారు. ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతా లోనూ, చానల్ యూట్యూబ్ చానల్ లో కూడా ఉంచారు.
ఈ వీడియోలో ఆయన కమలేశ్ తివారి మరణ వార్త తెలిసాక ఒవైసీ స్టేజి దిగుతూ నృత్యం చేసారు అని అనడం మనం చూడవచ్చు. చానల్ యూట్యూబ్ లింకు:
నిజ నిర్ధారణ
నిజ నిర్ధారణ ప్రక్రియలో, న్యూస్ మీటర్ కు భారత దేశ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ ఐ ట్విట్టర్ లో అక్టోబర్ 18న ప్రచురించిన వీడియో లభించింది.
దాని కధనం ప్రకారం మహారాష్ట్ర లో ఎన్నికల ప్రచారం సమయంలో అక్టోబర్ 17న ఔరంగాబాద్ లో ఒవైసీ ఈ డ్యాన్స్ చేసారని ఉంది.
అయితే, కమలేశ్ తివారి హత్యకు గురి అయ్యింది అక్టోబర్ 18, శుక్రవారం రోజున. అంటే, కమలేశ్ తివారి మరణించిన ఒక రోజు ముందే ఈ ఉదంతం జరిగింది.
దీంతో తేలింది ఏంటంటే, కమలేశ్ తివారి హత్య తరువాత ఒవైసీ ఆనందంతో డ్యాన్స్ చేసారనే వార్త అబద్దం. అయితే, తాను ఔరంగాబాద్ లో జరిగిన ర్యాలీ లో డ్యాన్స్ చేయలేదనీ, తమ పార్టీ చిహ్నం గాలిపటం కనుక గాలిపటం ఎగురవేస్తున్నట్టు చేసాను అని వివరణ ఇచ్చారు ఒవైసీ.
దావా: కమలేశ్ తివారి హత్య జరిగాక అసదుద్దిన్ ఒవైసీ డ్యాన్స్ చేసారు.
దావా చేసినవారు: సుదర్శన్ చానల్ యూట్యూబ్, ట్విట్టర్ లో ప్రసారమైన వీడియో.
నిజ నిర్ధారణ: అబద్దం. కమలేశ్ తివారి హత్య తరువాత ఒవైసీ ఆనందంతో డ్యాన్స్ చేసారనే మాట అబద్దం. ఈ వీడియో కమలేశ్ తివారి మరణించే రోజు ముందే చిత్రించబడింది.