మున్సిపోల్స్‌లో తొలిసారిగా 'ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ'

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jan 2020 1:40 PM IST
మున్సిపోల్స్‌లో తొలిసారిగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ

తెలంగాణలో జరుగుతున్న మున్సిపోల్స్‌ ఎన్నికల్లో దొంగ ఓట్లను నిరోధించేందుకు దేశంలోనే తొలిసారిగా ఓటర్ల ముఖాన్ని గుర్తించే ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని వినియోగించనున్నారు. మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మల్కాజిగిరి పార్ట‌మెంట్ నియోజ‌క ప‌రిధిలోని కుత్బుల్లాపూర్‌ మండలం కొంపల్లి మున్సిపాలిటీలోని పది పోలింగ్‌ కేంద్రాల్లో దీనిని ప్రయోగాత్మకంగా చేపడుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఎన్నికల అధికారులు.. ఆయా కేంద్రాలకు కేటాయించిన ఫొటో ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా రూపొందించిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. ఓటర్ల‌ను స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌తో ఫొటోతీసి.. అంతకుముందు డౌన్‌లోడ్‌చేసిన ఓటర్ల జాబితాలోని ఫొటోతో సరిపోలితేనే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. ఈ ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌ను టీఎస్‌టీఎస్‌ (తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌) రూపొందించింది.

Next Story