నాంపల్లి కోర్టుకు మాజీ ఎంపీ కవిత.. ఎన్నికల సమయంలో ఆ పని చేయడంతో కేసు..

By అంజి  Published on  27 Feb 2020 8:09 AM GMT
నాంపల్లి కోర్టుకు మాజీ ఎంపీ కవిత.. ఎన్నికల సమయంలో ఆ పని చేయడంతో కేసు..

హైదరాబాద్‌: నాంపల్లి కోర్టుకు నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరు అయ్యారు. 2010 సంవత్సరంలో ఉప ఎన్నిక సంద్భంగా ఎన్నికల ఉల్లంఘించిన కేసుపై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ఏ-1గా మాజీ ఎంపీ కవిత కోర్టుకు హాజరయ్యారు. ఏ-3గా ఝాన్సీ రాణి చనిపోయిన విషయాన్ని పోలీసులు కోర్టుకు తెలిపారు.ఏ-2గా ఉన్న మోపినేని నిర్మల, ఏ-4గా ఉన్న జుగల్‌ కిషోర్‌లు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో తదుపరి విచారణను నాంపల్లి కోర్టు మార్చి 19కి వాయిదా వేసింది.

కవిత కోర్టుకు హాజరవుతున్నారని తెలియడంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున నాంపల్లి కోర్టుకు వచ్చారు. కోర్టు హాలులోకి కార్యకర్తలు ప్రవేశించేందుకు యత్నించడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా అప్పటి నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.

అనంతరం ఉప ఎన్నికల సందర్భంగా ఉద్యమకారులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళనలు నిర్వహించారు. 2010 జులై 27 నిజామాబాద్‌ ఎస్పీ ఆఫీస్‌ ఎదురుగా ధర్నా చేపట్టారు. అప్పటికే సెక్షన్‌ 30 అమలులో ఉండడంతో కవిత, మోపినేని నిర్మల, బీజేపీ నేత ఝాన్సీ రాణి, జుగల్ కిషోర్‌పై ఐపీసీ 341, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Next Story