మాజీ మంత్రికి ఏడేళ్ల జైలు శిక్ష
By సుభాష్ Published on 24 April 2020 5:08 PM IST
ఓ మాజీ మంత్రికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. జార్ఖండ్ రాష్ట్ర మాజీ మంత్రి అనోష్ ఎక్కాకు మనీలాండరింగ్ కేసులో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో రాంచీలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. ఈ కేసును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జస్టిస్ మిశ్రా విచారించి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. జైలు శిక్షే కాకుండా రూ.2 కోట్ల జరిమానా కూడా విధించారు.
మాజీ మంత్రికి చెందిన ఆస్తులన్నింటిని ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తులన్నీ ఈడీ జప్తులోనే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం మాజీ మంత్రి రాంచీలోని బిర్సా మొండా సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఒక వేళ జరిమానా చెల్లించకుంటే మరో ఏడేళ్లు జైలు శిక్ష పొడిగించనున్నట్లు తీర్పునిచ్చారు.
Next Story