ఎర్రగడ్డకు క్యూ కట్టిన మద్యం ప్రియులు
By సుభాష్ Published on 31 March 2020 6:57 PM ISTకరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు 21 రోజులపాటు లాక్‌డౌన్ అమలు అవుతోంది. దీంతో ప్రజలకు నిత్యావసర వస్తువుల షాపులు తప్ప మిగతావన్నీ బంద్ అయ్యాయి. ఇక లాక్‌డౌన్ కారణంగా మందుబాబులకు ఎక్కడలేని కష్టం వచ్చింది. మద్యం షాపులు మూసివేసిన నాటి నుంచి మద్యం ప్రియులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కొందరైతే మద్యం లేకుండా ఉండలేక మానసికంగా కృంగిపోతున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో మద్యం షాపుల విషయంలో ప్రభుత్వాలు కఠినగా వ్యవహరించడంపై మద్యం బాబులు నిలకడగా ఉండలేకపోతున్నారు.
మద్యానికి బానిసై ఇద్దరు, ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరి కొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం లాంటివి చేస్తున్నారు. వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. దీంతో వారివారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. వారిని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎర్రగడ్డ ఆస్పత్రికి మందుబాబుల తాకిడి ఎక్కువైంది. వింత వింతగా ప్రవర్తిస్తున్న వారి సంఖ్య వందకుపైగా చేరినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.