'మా నీళ్ల ట్యాంక్'.. మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోందిగా..!

ZEE5's 'Maa Neella Tank’ streams to a thumping response. ఓటీటీలలో ప్రతి వారం కొత్త కొత్త కంటెంట్ వచ్చి చేరుతూ ఉంది.

By Medi Samrat  Published on  22 July 2022 4:55 PM IST
మా నీళ్ల ట్యాంక్.. మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోందిగా..!

ఓటీటీలలో ప్రతి వారం కొత్త కొత్త కంటెంట్ వచ్చి చేరుతూ ఉంది. అయితే ఆసక్తికలిగించే అంశాలు ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలా తక్కువగా వస్తూ ఉన్నాయి. తాజాగా ZEE5 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషలలో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను అందిస్తోంది. తెలుగులో కూడా వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తూ వెళుతోంది.

జూలై 15 న జీ5 లో 'మా నీళ్ల ట్యాంక్' ప్రీమియర్‌ మొదలైంది. సుశాంత్‌, ప్రియా ఆనంద్‌ జంటగా నటించిన ఈ 8 ఎపిసోడ్‌ల సిరీస్‌ ప్రేక్షకులకు బాగా నచ్చింది. బుచ్చివోలులో జరిగిన ఫీల్ గుడ్ పల్లెటూరి డ్రామాపై ప్రేక్షకులు తమ అపారమైన ప్రేమను కురిపిస్తున్నారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ZEE5 ఇండియాలో 'మా నీళ్ల ట్యాంక్' టాప్ 3 ట్రెండింగ్‌లో ఉంది. 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను ఈ సిరీస్ సొంతం చేసుకుంది. తెలుగు నేటివిటీ నచ్చి.. మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వారికి 'మా నీళ్ల ట్యాంక్' నచ్చుతుంది.









Next Story